Telugu Global
Others

చంద్ర‌బాబుకు ఏమైయింది?

మెట్రో యువ‌త‌కు ప‌బ్ ల పిచ్చి ప‌ట్టిన‌ట్లే….ఈ మ‌ధ్య చంద్ర‌బాబుకు హ‌బ్ ల‌ పిచ్చి ప‌ట్టింది. ఆయ‌న నోరు తెరిస్తే హ‌బ్ హ‌బ్ అంటున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న‌కు స‌న్నిహితుడైన ఒకాయ‌న కూడా దీనిపై కామెంట్ చేశారు… ఏంటంటే… ఇప్పుడు మా బాబు గుండె ల‌బ్ డ‌బ్ అని కాకుండా హ‌బ్ హ‌బ్ అని కొట్టుకుంటోంద‌ని.. చూస్తుంటే నిజ‌మే అనిపిస్తోంది. రాష్ర్టాన్ని ఎల‌క్ర్టానిక్ హ‌బ్,  ఎడ్యుకేష‌న్ హ‌బ్‌, వైద్య ప‌రిక‌రాల త‌యారీ హ‌బ్, ఐటి హ‌బ్, హార్డ […]

చంద్ర‌బాబుకు ఏమైయింది?
X
మెట్రో యువ‌త‌కు ప‌బ్ ల పిచ్చి ప‌ట్టిన‌ట్లే….ఈ మ‌ధ్య చంద్ర‌బాబుకు హ‌బ్ ల‌ పిచ్చి ప‌ట్టింది. ఆయ‌న నోరు తెరిస్తే హ‌బ్ హ‌బ్ అంటున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న‌కు స‌న్నిహితుడైన ఒకాయ‌న కూడా దీనిపై కామెంట్ చేశారు… ఏంటంటే… ఇప్పుడు మా బాబు గుండె ల‌బ్ డ‌బ్ అని కాకుండా హ‌బ్ హ‌బ్ అని కొట్టుకుంటోంద‌ని.. చూస్తుంటే నిజ‌మే అనిపిస్తోంది. రాష్ర్టాన్ని ఎల‌క్ర్టానిక్ హ‌బ్, ఎడ్యుకేష‌న్ హ‌బ్‌, వైద్య ప‌రిక‌రాల త‌యారీ హ‌బ్, ఐటి హ‌బ్, హార్డ వేర్ హ‌బ్, టెక్నాల‌జీ హ‌బ్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హ‌బ్, ఆటోమొబైల్ హ‌బ్, టెక్స్ టైల్ హ‌బ్ ఇలా చెప్పుకుంటూ పోతే బాబుగారు చెబుతున్న హ‌బ్ ల సంఖ్య చెప్ప‌డానికి పేజీలు స‌రిపోవు. హ‌బ్బుహ‌బ్బంటూ చంద్ర‌బాబు గ‌బ్బుగ‌బ్బు చేస్తున్నాడ‌ని రాయ‌ల‌సీమ నాయ‌కుడొక‌రు ఈస‌డించుకున్నారు. చంద్ర‌బాబు గ‌తంలో అర‌చేతిలో వైకుంఠం చూపించి పాల‌న సాగించారు… ఇప్ప‌డు టెక్నాల‌జీ వాడుకుంటూ గ్రాఫిక్స్ లో చూపిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఒక‌టే సెటైర్లు వ‌స్తున్నాయి. దూకుడు సినిమాలో ఎమ్మెస్ నారాయ‌ణ క‌ళ్ల కింద క్యారీ బ్యాగుల‌ను గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేయాల‌నుకున్న‌ట్లు చంద్ర‌బాబు త‌న ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సైతం ఇప్పుడు హ‌బ్బులు, అమ‌రావ‌తి గ్రాఫిక్స్ తో మ్యానేజ్ చేయాల‌ని చూస్తున్నార‌ని నెటిజ‌న్లు ఒక‌టే ఆడిపోసుకుంటున్నారు. బాబును అతి ద‌గ్గ‌ర‌గా చూసిన‌వారేకాదు… బాబును క‌నీసం ఒక‌సారి కూడా చూడ‌నివారు కూడా ఇప్పుడు ఒక‌టే డౌటు అడుగుతున్నారు.. ఈ చంద్ర‌బాబుకు ఏమైంది? అని… అవును చంద్ర‌బాబుకు ఏమైంది?
First Published:  7 Nov 2015 3:48 AM GMT
Next Story