Telugu Global
CRIME

తుపాకీ మిస్‌ఫైర్‌... హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం

హైదరాబాద్‌ పరిధిలోని అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడ పని చేస్తున్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. మొయినుద్దీన్‌ అనే ఈ హెడ్‌ కానిస్టేబుల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌లోనే ఉంటున్నాడు. సోమవారం ఉదయమే ఆఫీసుకు రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు. ఏమైందో తెలీదుగాని చేతిలో ఉన్న తుపాకీ అకస్మాత్తుగా ఫైర్‌ అయ్యింది. దీంతో ఈ హెడ్‌ కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన […]

హైదరాబాద్‌ పరిధిలోని అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడ పని చేస్తున్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. మొయినుద్దీన్‌ అనే ఈ హెడ్‌ కానిస్టేబుల్‌ పోలీస్‌ క్వార్టర్స్‌లోనే ఉంటున్నాడు. సోమవారం ఉదయమే ఆఫీసుకు రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు. ఏమైందో తెలీదుగాని చేతిలో ఉన్న తుపాకీ అకస్మాత్తుగా ఫైర్‌ అయ్యింది. దీంతో ఈ హెడ్‌ కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మరణించాడు. చనిపోయిన మొయినుద్దీన్‌ స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ గ్రామంగా పోలీసు అధికారులు చెబుతున్నారు.

First Published:  7 Nov 2015 3:01 PM GMT
Next Story