డ్రంక్ అండ్ డ్రైవ్- మీడియాను ఉతికేసిన జయప్రద


img1హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ రోడ్డు  నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్

సందర్భంగా మీడియా అత్యుత్సాహం నటి జయప్రదకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మీడియా ప్రతినిధుల తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాపూర్ వైపు నుంచి ఫిలింనగర్ వైపు వెళ్తున్న జయప్రద కారును ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ఆమె డ్రైవర్‌కు  నిర్వహించారు. అయితే అతడు ఎలాంటి మద్యం తాగలేదని తేలింది. దీంతో వారు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుండగా మీడియా ప్రతినిధులు సీన్‌లోకి ఎంటరయ్యారు.

img2జయప్రద సెలబ్రిటీ కావడంతో ఆమె కారు డ్రైవర్‌కు మరోమారు పరీక్షలు నిర్వహిస్తే ఆ దృశ్యాన్ని రికార్డు చేసుకుంటామని పోలీసులను కోరారు. దీనికి పోలీసులు కూడా తలుపారు.  మరోమారు  జయప్రద కారు డ్రైవర్‌కు  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడానికి యత్నించారు.

img3దీంతో జయప్రద కోపం కట్టలు తెంచుకుంది.  కారు దిగి.. సెలబ్రిటీల ఫొటోలు పెద్ద పెద్దగా వేసి తమాషా చేసేందుకే రెండోసారి టెస్టులు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును కూడా ఆపాలా అని పోలీసులను ఉద్దేశించి మండిపడ్డారు. వీడియో చిత్రీకరిస్తున్న కెమెరామెన్లపై కూడా  ఆగ్రహం వ్యక్తం చేశారు. జయప్రద ఆగ్రహంతో పోలీసులు కూడా షాకయ్యారు. సారీ చెప్పి ఆమెను శాంతింపచేసి అక్కడి నుంచి పంపించివేశారు.