Telugu Global
CRIME

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ఫిజియో థెరఫీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విజయ్‌కుమార్‌ అనే 24 యేళ్ళ విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్స్‌ పాత భవనంలోని 6వ ఫ్లోర్‌లోకి వెళ్ళి ఆయన తనువు చాలించాడు. మృతుడి స్వస్థలం మెదక్‌ జిల్లా పటాన్‌చెరువు. సహచర వైద్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందజేసినట్టు వైద్యులు తెలిపారు.

First Published:  7 Nov 2015 3:01 PM GMT
Next Story