Telugu Global
Cinema & Entertainment

అఖిల్... న‌న్నెంత ప్రేమిస్తున్నావ్‌?

త‌న సినిమా విడుద‌ల సంద‌ర్భంగా అఖిల్ టివిషోల్లో ఎక్కువ‌గా క‌న‌బ‌డుతున్నాడు. షోల్లో గ్యాల‌రీల్లో ఉన్న అమ్మాయిల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాడు. అమ్మాయిలు అడుగుతున్న చిలిపి ప్ర‌శ్న‌ల‌కు కాస్త సిగ్గుప‌డుతూనే స‌మాధానాలు ఇస్తున్నాడు. అమ్మాయిలు స‌రే…అబ్బాయిల నుండి సైతం అఖిల్‌కి ఇవే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి పాపం. అఖిల్ చిత్ర నిర్మాత నితిన్‌…అఖిల్‌ని ట్విట్ట‌ర్లో…అఖిల్ గారూ మీరు న‌న్నెంత ప్రేమిస్తున్నారు? అనే ప్ర‌శ్న వేశాడు. అందుకు  అఖిల్‌…నేను మాటల్లో చెప్ప‌లేక‌పోతున్నా నితిన్ గారూ….అంటూ స‌మాధానం ఇచ్చాడు. ఈ యువ‌న‌టుల ప్రేమ క‌హానీకి […]

అఖిల్... న‌న్నెంత ప్రేమిస్తున్నావ్‌?
X

త‌న సినిమా విడుద‌ల సంద‌ర్భంగా అఖిల్ టివిషోల్లో ఎక్కువ‌గా క‌న‌బ‌డుతున్నాడు. షోల్లో గ్యాల‌రీల్లో ఉన్న అమ్మాయిల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాడు. అమ్మాయిలు అడుగుతున్న చిలిపి ప్ర‌శ్న‌ల‌కు కాస్త సిగ్గుప‌డుతూనే స‌మాధానాలు ఇస్తున్నాడు. అమ్మాయిలు స‌రే…అబ్బాయిల నుండి సైతం అఖిల్‌కి ఇవే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి పాపం. అఖిల్ చిత్ర నిర్మాత నితిన్‌…అఖిల్‌ని ట్విట్ట‌ర్లో…అఖిల్ గారూ మీరు న‌న్నెంత ప్రేమిస్తున్నారు? అనే ప్ర‌శ్న వేశాడు. అందుకు అఖిల్‌…నేను మాటల్లో చెప్ప‌లేక‌పోతున్నా నితిన్ గారూ….అంటూ స‌మాధానం ఇచ్చాడు. ఈ యువ‌న‌టుల ప్రేమ క‌హానీకి సమంత త‌న కామెంట్‌తో కొస‌మెరుపు అద్దింది. నితిన్‌, మీరు ఈ కెమిస్ట్రీని నాతో చూపితే మ‌నం ఒక బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని ఇవ్వ‌వ‌చ్చు… అంటూ పోస్ట్ చేసింది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా అ…ఆ లో నితిన్‌, స‌మంతా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నితిన్ దీన్ని స్పోర్టివ్‌గా తీసుకుని…ష‌ట‌ప్ శామ్‌….మా బ్రొమాన్స్ (మ‌గ‌వారి మ‌ధ్య ఆత్మీయ బంధం)కి మ‌ధ్య‌లో విల‌న్‌లా రాకు…అంటూ ట్వీట్ చేశాడు.

samantha-twit

First Published:  9 Nov 2015 9:33 AM GMT
Next Story