Telugu Global
Cinema & Entertainment

నేను బాలీవుడ్ సినిమా చేయట్లేదు

ప్రస్తుతం తన డెబ్యూ మూవీకి ప్రచారం కల్పించే పనిలో బిజీగా ఉన్నాడు అఖిల్. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తన రెండో వెంచర్ ను స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉండగా.. అఖిల్ రెండో సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే బ్రూస్ లీ ఫ్లాప్ తో శ్రీనువైట్ల ను తప్పించినట్టు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు అఖిల్, తన రెండో సినిమాకే బాలీవుడ్ బాట పట్టొచ్చని కూడా పుకార్లు షికార్లు […]

నేను బాలీవుడ్ సినిమా చేయట్లేదు
X
ప్రస్తుతం తన డెబ్యూ మూవీకి ప్రచారం కల్పించే పనిలో బిజీగా ఉన్నాడు అఖిల్. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని తన రెండో వెంచర్ ను స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉండగా.. అఖిల్ రెండో సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే బ్రూస్ లీ ఫ్లాప్ తో శ్రీనువైట్ల ను తప్పించినట్టు కూడా వార్తలొచ్చాయి. మరోవైపు అఖిల్, తన రెండో సినిమాకే బాలీవుడ్ బాట పట్టొచ్చని కూడా పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికీ సిసింద్రీ క్లారిటీ ఇచ్చాడు.
తన బాలీవుడ్ కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టంచేశాడు అఖిల్. ఆ దిశగా ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ తిరస్కరించానన్నాడు. కొన్నేళ్ల పాటు కంప్లీట్ గా తెలుగులోనే సినిమాలు చేస్తానని, ఇక్కడ నిరూపించుకున్న తర్వాతే బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టంచేశాడు. రెండో సినిమాగా కాదుకదా..కనీలం 12వ సినిమాగా కూడా తను బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదని వివరణ ఇచ్చాడు. సో.. అఖిల్ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తాడనే విషయం స్పష్టమైంది.
First Published:  8 Nov 2015 7:08 PM GMT
Next Story