Telugu Global
Cinema & Entertainment

ఈనెల 20న కుమారి వస్తోంది

సుకుమార్ నిర్మాతగా తొలి వెంచర్ విడుదలకు సిద్ధమౌతోంది. అతడే సినిమాకు డబ్బులు పెట్టాడు. కథ సమకూర్చాడు. కథనం కూడా ఇచ్చాడు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది. సినిమాను ఈనెల 20న థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. బన్నీ దీనికి ముఖ్య అతిథిగా వచ్చాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన […]

ఈనెల 20న కుమారి వస్తోంది
X
సుకుమార్ నిర్మాతగా తొలి వెంచర్ విడుదలకు సిద్ధమౌతోంది. అతడే సినిమాకు డబ్బులు పెట్టాడు. కథ సమకూర్చాడు. కథనం కూడా ఇచ్చాడు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ అయింది. సినిమాను ఈనెల 20న థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. బన్నీ దీనికి ముఖ్య అతిథిగా వచ్చాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఓ మోస్తరుగా క్లిక్కయ్యాయి. అటు రత్నవేటు సినిమాటోగ్రఫీతో పాటు.. తాజాగా విడుదల చేసిన ట్రయిలర్ హిట్టవ్వడం కుమారి 21-ఎఫ్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా కూడా హిట్టయితే నిర్మాతగా సుకుమార్ సక్సెస్ అవ్వడం మాట అటుంచి.. రాజ్ తరుణ్ మాత్రం హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే ఉయ్యాలజంపాల, సినిమా చూపిస్త మామ సినిమాలతో రాజ్ తరుణ్ వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు. తాజాగా కుమారి మూవీ కూడా హిట్టయితే.. రాజ్ తరుణ్ హ్యాట్రిక్ కొట్టినట్టే.
First Published:  8 Nov 2015 7:15 PM GMT
Next Story