Telugu Global
Others

సైలెంట్ ఫైర్‌వ‌ర్క్స్‌....మ‌రింత మోత మోగాయి

ఇప్పుడు ప్ర‌పంచంలో మార్కెట్ అనేది … వినియోగ‌దారుడు ఏం కోరినా తెచ్చి ఇచ్చే అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా ఉంది. వినియోగ‌దారుల క‌ల‌ల‌ను క‌ళ్ల ముందుకు తెచ్చే ఇంద్రజాలంలా ఉంది. ఇంగ్లండులోని బ‌ర్మింగ్‌హాం బొటానిక‌ల్ గార్డెన్స్ అలాంటి ఇంద్ర‌జాలమే చేయ‌బోయి, బొక్క‌బోర్లా ప‌డింది.  బ‌ర్మింగ్‌హాం బొటానిక‌ల్ గార్డెన్స్‌లో,  నిశ్బ‌బ్దంగా పేలుతూ వెలుగుల‌ను విర‌జిమ్మే బాణ‌సంచాని ప్ర‌ద‌ర్శిస్తున్నాం వ‌చ్చి చూడండి…ఇవి మిగిలిన వాటికంటే డిఫ‌రెంట్… అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు నిర్వాహ‌కులు.  ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లున్న త‌ల్లిదండ్రులు వ‌చ్చితీరాలి…అంటూ […]

సైలెంట్ ఫైర్‌వ‌ర్క్స్‌....మ‌రింత మోత మోగాయి
X

ఇప్పుడు ప్ర‌పంచంలో మార్కెట్ అనేది … వినియోగ‌దారుడు ఏం కోరినా తెచ్చి ఇచ్చే అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా ఉంది. వినియోగ‌దారుల క‌ల‌ల‌ను క‌ళ్ల ముందుకు తెచ్చే ఇంద్రజాలంలా ఉంది. ఇంగ్లండులోని బ‌ర్మింగ్‌హాం బొటానిక‌ల్ గార్డెన్స్ అలాంటి ఇంద్ర‌జాలమే చేయ‌బోయి, బొక్క‌బోర్లా ప‌డింది. బ‌ర్మింగ్‌హాం బొటానిక‌ల్ గార్డెన్స్‌లో, నిశ్బ‌బ్దంగా పేలుతూ వెలుగుల‌ను విర‌జిమ్మే బాణ‌సంచాని ప్ర‌ద‌ర్శిస్తున్నాం వ‌చ్చి చూడండి…ఇవి మిగిలిన వాటికంటే డిఫ‌రెంట్… అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు నిర్వాహ‌కులు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌లున్న త‌ల్లిదండ్రులు వ‌చ్చితీరాలి…అంటూ ఊద‌ర‌గొట్టారు. నిజంగానే త‌మ పిల్ల‌ల‌కు ఏమాత్రం హాని చేయ‌ని క్రాక‌ర్స్ దొరుకుతాయేమోన‌ని రెండు, మూడు సంవ‌త్స‌రాల వ‌య‌సున్న పిల్ల‌లు క‌లిగిన‌ త‌ల్లిదండ్రులు పార్కుకి చేరారు.

_86574455_fireworksతీరా ప్ర‌ద‌ర్శ‌న మొద‌ల‌య్యే స‌రికి త‌ల్లిదండ్రుల దిమ్మ‌తిరిగి పోయింది. త‌మ చిన్నారులు ఎలాంటి శ‌బ్దాలు లేని వెలుగుల‌ను చూసి ఎంజాయి చేస్తార‌ని వ‌చ్చిన వారంతా తీవ్రంగా నిరాశ చెందారు. పూర్త‌య్యాక సైలెంట్ ఫైర్‌వ‌ర్క్స్‌ ఎలా ఉన్నాయో చెప్ప‌మ‌న్న‌పుడు చాలా ఘాటుగా స్పందించారు. అవి మామూలువాటికంటే మ‌రింత ఎక్కువ‌గా మోగాయి…మా పాప‌ని తీసుకుని లోప‌లికి ప‌రిగెత్తాల్సివ‌చ్చింద‌ని ఒక త‌ల్లి చెప్పింది. ప‌లువురు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ స్పంద‌న తెలిపారు. అవి అందంగానే ఉన్నాయి…కానీ సైలెంట్‌గా మాత్రం లేవ‌ని ముక్త‌కంఠంతో చెప్పారు. సైలెంట్ ఫైర్‌వ‌ర్క్స్‌… సైలెన్స్‌కి చాలా దూరంగా ఉన్నాయి…ప్ర‌క‌ట‌న చూసి వ‌చ్చిన మాకు చాలా నిరాశ ఎదురైంది, మా పిల్ల‌లు బాగా భ‌య‌ప‌డిపోయారు అంటూ చాలామంది త‌మ కోపాన్ని వ్య‌క్తం చేశారు. దీనిపై బ‌ర్మింగ్‌హాం బొటానిక‌ల్ గార్డెన్స్ వారిని బిబిసి ప్ర‌శ్నించ‌గా వారు ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.

First Published:  9 Nov 2015 4:09 AM GMT
Next Story