Telugu Global
International

పాక్‌ను కట్టడి చేయకపోతే పెను ప్రమాదమే

ఉగ్రవాద ముఠాలకు పురిటిగడ్డగా భాసిల్లుతున్న పాకిస్థాన్ అణ్వస్త్ర కార్యక్రమాలకు పగ్గం వేయకపోతే అది ప్రపంచానికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని న్యూయార్స్‌ టైమ్స్‌ హెచ్చరించింది. పాక్‌ను కట్టడి చేయకపోతే మరో పదేళ్ళలో 120 అణ్వస్త్రాలతో పాక్‌ అమెరికా, రష్యా సరసన చేరుతుందని పేర్కొంది. ‘పాక్‌ అణు ఆయుధాగారం వేగంగా విస్తరిస్తోంది. భారత్‌ను ఎదిరించడానికి ఏర్పాటు చేసుకునే చిన్న ఆయుధాలతోపాటు ప్రపంచాన్ని గడగడలాడించడానికి కావాల్సిన అణ్వస్త్రాలను సముపార్జించుకుంటోందని వెల్లడించింది. ఒకవైపు ఉగ్రవాదులకు నిలయంగా మారుతూ… మరోవైపు అణ్వస్త్ర లక్ష్యాలతో […]

పాక్‌ను కట్టడి చేయకపోతే పెను ప్రమాదమే
X

ఉగ్రవాద ముఠాలకు పురిటిగడ్డగా భాసిల్లుతున్న పాకిస్థాన్ అణ్వస్త్ర కార్యక్రమాలకు పగ్గం వేయకపోతే అది ప్రపంచానికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని న్యూయార్స్‌ టైమ్స్‌ హెచ్చరించింది. పాక్‌ను కట్టడి చేయకపోతే మరో పదేళ్ళలో 120 అణ్వస్త్రాలతో పాక్‌ అమెరికా, రష్యా సరసన చేరుతుందని పేర్కొంది. ‘పాక్‌ అణు ఆయుధాగారం వేగంగా విస్తరిస్తోంది. భారత్‌ను ఎదిరించడానికి ఏర్పాటు చేసుకునే చిన్న ఆయుధాలతోపాటు ప్రపంచాన్ని గడగడలాడించడానికి కావాల్సిన అణ్వస్త్రాలను సముపార్జించుకుంటోందని వెల్లడించింది. ఒకవైపు ఉగ్రవాదులకు నిలయంగా మారుతూ… మరోవైపు అణ్వస్త్ర లక్ష్యాలతో ముందుకు వెళుతున్న పాక్‌ను అదుపులో పెట్టకపోతే మొత్తం భూ ప్రపంచానికే పెను ప్రమాదం తప్పదని న్యూయార్క్‌ టైమ్స్‌ హెచ్చరించింది. ఒక్క అణుబాంబు కూడా లేని ఇరాన్‌ను అదుపులో పెట్టేందుకు అగ్రరాజ్యాలు రెండేళ్ళు చర్చలు జరపాల్సి వచ్చిందని, కాని పాక్‌తో మాత్రం ఆ దిశలో ప్రయత్నాలు కూడా లేవని, ఇది చాలా ప్రమాదకర సంకేతమని ఆ పత్రిక వివరించింది. భద్రతా వ్యవహారాల పట్ల నరేంద్ర మోదీ ఉదాసీనంగా ఉండడాన్ని తప్పుపడుతూ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఆయన ప్రయత్నం చేయాలని సూచించింది.

First Published:  10 Nov 2015 12:08 PM GMT
Next Story