Telugu Global
Cinema & Entertainment

హ్యాట్రిక్ పై కన్నేసిన శర్వానంద్

ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్నాడు శర్వానంద్. ఇప్పుడు ముచ్చటగా మూడో హిట్ పై కన్నేశాడు. ఆ హీరో నటించిన తాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మేర్లపాక గాంధీ, తన రెండో ప్రయత్నంగా శర్వానంద్ తో ఈ ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చేశాడు. తాజాగా ఈ […]

హ్యాట్రిక్ పై కన్నేసిన శర్వానంద్
X
ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో ఊపుమీదున్నాడు శర్వానంద్. ఇప్పుడు ముచ్చటగా మూడో హిట్ పై కన్నేశాడు. ఆ హీరో నటించిన తాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మేర్లపాక గాంధీ, తన రెండో ప్రయత్నంగా శర్వానంద్ తో ఈ ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.
రన్ రాజా రన్ తో మంచి హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఆమధ్య మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చేస్తున్నాడు. బీరువా సినిమాలో హీరోయిన్ గా నటించిన సురభి ఇందులో శర్వానంద్ సరసన నటించింది. యూవీ క్రియేషన్స్ – శర్వానంద్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
First Published:  9 Nov 2015 1:01 PM GMT
Next Story