Telugu Global
CRIME

తరుముతూ భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్‌

కట్టుకున్న భార్యతో కయ్యానికి దిగాడు. వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. భార్యను చితక్కొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు మాటామాటా అనుకున్నారు. వివాదం ఇంకా పెద్దదయ్యింది. భర్త కోపం నెత్తికెక్కింది. అంతే తన దగ్గరున్న రివాల్వర్‌ను బయటకు తీసి భార్యపై కాల్పులకు దిగాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. ఇంకా అతని కోపం తీరలేదు. మళ్ళీ కాల్పులకు దిగడంతో ఆమె పారిపోయే ప్రయత్నం చేసింది. రోడ్డుపైకి వెళ్ళిపోయింది. అయినా మొండి మొగుడు వదలలేదు. రోడ్డుపై వెంటాడి తరుముతూ కాల్పులు […]

తరుముతూ భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్‌
X

కట్టుకున్న భార్యతో కయ్యానికి దిగాడు. వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. భార్యను చితక్కొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు మాటామాటా అనుకున్నారు. వివాదం ఇంకా పెద్దదయ్యింది. భర్త కోపం నెత్తికెక్కింది. అంతే తన దగ్గరున్న రివాల్వర్‌ను బయటకు తీసి భార్యపై కాల్పులకు దిగాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. ఇంకా అతని కోపం తీరలేదు. మళ్ళీ కాల్పులకు దిగడంతో ఆమె పారిపోయే ప్రయత్నం చేసింది. రోడ్డుపైకి వెళ్ళిపోయింది. అయినా మొండి మొగుడు వదలలేదు. రోడ్డుపై వెంటాడి తరుముతూ కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో భార్య శరీరంలోకి తూటా దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయింది. తనకు ఎలాగైనా శిక్ష తప్పదనుకున్న పోలీసు ఇంటికెళ్ఙపోయి తలుపులేసుకుని లోపల కూర్చున్నాడు. బ్రెజిల్‌ దేశంలో జరిగిన ఈ సంచలన సంఘటన గురించి ఆనోటా ఈనోటా పోలీసు అధికారులకు చేరింది. సదరు భర్త ఇంటికెళ్ళి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల సంఘటన మొత్తం రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలో నమోదైంది.

First Published:  10 Nov 2015 7:55 AM GMT
Next Story