Telugu Global
Cinema & Entertainment

 అఖిల్ సినిమా రివ్యూ

అఖిల్ సినిమా రివ్యూ రేటింగ్‌.2.5/5 విడుదల తేదీ : 11 నవంబర్ 2015 దర్శకత్వం : వివి వినాయక్ నిర్మాత : నితిన్ సంగీతం : అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ నటీనటులు : అఖిల్, సయేషా సైగల్, బ్రహ్మానందం.. గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ గా మారి అక్కినేని అభిమానులతో పాటు, సినీ వర్గాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్ అంటే.. […]

   అఖిల్ సినిమా రివ్యూ
X

అఖిల్ సినిమా రివ్యూ
రేటింగ్‌.2.5/5
విడుదల తేదీ : 11 నవంబర్ 2015
దర్శకత్వం : వివి వినాయక్
నిర్మాత : నితిన్
సంగీతం : అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్
నటీనటులు : అఖిల్, సయేషా సైగల్, బ్రహ్మానందం..

గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ గా మారి అక్కినేని అభిమానులతో పాటు, సినీ వర్గాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘అఖిల్’. ఈ సినిమాకి ఎందుకింత క్రేజ్ అంటే.. అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు, నాగార్జున – అమలల ముద్దుల తనయుడు అఖిల్ తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని లాంచ్ చేస్తూ చేసిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు. ‘అఖిల్’ నేడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అక్కినేని ఫ్యామిలీ, అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్ మొదటి సినిమాతో వారి ఆశలను ఎంతవరకూ నిజం చేసాడనేది ఇప్పుడు చూద్దాం..

కథ :
సరదా కుర్రాడు అఖిల్ (అఖిల్ అక్కినేని) మెడికల్ స్టూడెంట్ దివ్య (సాయేషా)తో ప్రేమలో పడతాడు. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆమె కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తూంటాడు. ఇలా వీరి ప్రేమ కథ నడుస్తూండగా…ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ ఉంటే ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుస్తుంది. మరో ప్రక్క జర్మన్ సైంటిస్ట్ కత్రోచి…జువా ని తన గుప్పెట్లో పెట్టుకుని అతీత శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నిస్తూంటాడు. ఇది తెలియని అఖిల్…దివ్యను వెనక్కి తేవటం కోసం బ్రహ్మానందంతో కలిసి కొంత‌మంది ట్రైబర్ తెగ సాయిం తీసుకుని బయిలు దేరతాడు. వారితో కలిసి జర్నీ చేస్తున్న సమయంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవే అతని జీవితాన్ని, లక్ష్యాన్ని సమూలంగా మార్చేస్దాయి. ఆ సంఘటనలు ఏమిటి..?జువాకు అఖిల్ కు సంభంధం ఏమిటి..?అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చేరుకున్నాడా,? విలన్ నుంచి జువాని రక్షించి ప్రపంచాన్ని రక్షించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో సినిమాకి బాగా హెల్ప్ అయిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే బాగా ఫెయిల్ అయిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.. ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుంటే.. సినిమాకి మొదటి బలం స్టొరీ లైన్ మరియు పూర్తి కథ – వెలిగొండ శ్రీనివాస్ ఎంచుకున్న జువా బ్యాక్ డ్రాప్ స్టొరీ లైన్ బాగుంది, దానికోసం అనుకున్న ఆఫ్రికా నేపధ్యమూ బాగుంది. కానీ పూర్తి కథను రాసుకున్న విధానం మాత్రం చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంది. కథ రొటీన్ అయినా కథనం బాగుంటే సరిపోయేది కానీ వినాయక్ రాసుకున్న కథనంలో ఆడియన్స్ ని కథకి హుక్ చేసే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం, ఉన్న జువా పాయింట్ ని సినిమా మొదట్లోనే చెప్పేయడం సినిమాకి మరో పెద్ద మైనస్ అయ్యింది. వినాయక్ ఒక కమర్షియల్ డైరెక్టర్ గా కొన్ని కమర్షియల్ అంశాలను మాత్రం పర్ఫెక్ట్ గా చూపించాడని చెప్పాలి. మిగతా కొన్ని కీలక అంశాల్లో వినాయక్ తన మార్క్ తో మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా వినాయక్ సినిమాల్లో కామెడీని బాగా పడుతుంది కానీ ఇందులో కామెడీ కూడా అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

ఇక మిగిలిన వాటిల్లో అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్పెయిన్ లో, బ్యాంకాక్ లో షూట్ చేసిన ప్రతి ఎపిసోడ్ ని చాలా కలర్ ఫుల్ గా గ్రాండ్ గా ఉండేలా చూపించాడు. అనూప్ రూబెన్స్ – తమన్ అందించిన పాటలు బాగున్నాయి, కానీ ఆ పాటలకి మంచి లొకేషన్స్, పిక్చరైజేషన్ మరియు అఖిల్ డాన్సులు తోడవడంతో సినిమాలో చూడటానికి చాలా చాలా బాగున్నాయి. ఇకపోతే మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం సినిమాలోని చాలా సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది. గౌతంరాజు చాలా వరకూ ఎడిట్ చేసి మనకు ట్రిమ్ వెర్షన్ అందించారు. దీనివలన సినిమా సడన్ గా జంప్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది, అలాగే ట్రిమ్ వెర్షన్ లో కూడా అక్కడక్కడా సాగాదీత కనపడుతుంది. ఎస్ఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సింప్లీ సూపర్బ్.. కోన వెంకట్ డైలాగ్స్ చాలా వరకూ బాగానే పేలాయి. ఇక చాలా కర్చు పెట్టి చేసిన సిజి వర్క్ అయితే ఆకట్టుకునేలా లేదు. ఫైనల్ గా నితిన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ విలువలు కథా పరంగా బాగా రిచ్ గా కనిపిస్తాయి. వీరు అంత పెట్టినా సిజి విజువల్స్ ని కేక అనుకునేలా చూపించలేకపోవడం బాధాకరం.
విశ్లేషణ :
అఖిల్ ఫాంటసీ కథాంశం కాకపోయినా.. చిన్న ఫాంటసీ ఎలిమెంట్ ను పక్కా కమర్షియల్ జానర్లో ప్రజెంట్ చేశారు. అఖిల్ తొలి సినిమానే అయినా ఓ స్టార్ హీరో సినిమాలో ఉండే అన్ని ఎమోషన్స్ ను ఈ సినిమాలో చూపించారు. ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్ ఎపిసోడ్స్, యాక్షన్, డ్రామా ఇలా అన్ని రకాల సీన్స్ తో అఖిల్ స్టామినా ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా కూడా అదే స్ధాయిలో వచ్చింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :
అఖిల్ పర్ఫామెన్స్, డ్యాన్స్, యాక్షన్
వినాయక్ టేకింగ్
సినిమా నిడివి
బ్యాగ్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ లైన్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
గ్రాఫిక్స్

ఓవరాల్ గా ‘అఖిల్’ అక్కినేని అభిమానులకు ఫుల్ ట్రీట్, అఖిల్ కు పర్ఫెక్ట్ లాంచింగ్

First Published:  11 Nov 2015 5:20 AM GMT
Next Story