Telugu Global
Cinema & Entertainment

కొండపైకి నడిచి వెళ్లిన అఖిల్

సినిమా థియేటర్లలోకి రావడం ఒకెత్తు. వచ్చిన తర్వాత అది హిట్టవ్వడం మరో ఎత్తు. ఇలా ఎన్నో విఘ్నాలు దాటుకొని సినిమా సక్సెస్ అవ్వాలి. పైగా అఖిల్ లాంటి మోస్ట్ ఎవెయిటింగ్ మూవీపై అంచనాలు బాగా ఉంటాయి. అందరి చూపు దానిపైనే ఉంటుంది. పైగా ఇప్పటికే సినిమా ఓసారి పోస్ట్ పోన్ కూడా అయింది. అందుకేనేమో అఖిల్ మొక్కుకున్నాడు. కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అఖిల్, ఈరోజు ఆ మొక్కు తీర్చుకున్నాడు. అలిపిరి నుంచి నడకదారిన తిరుమల […]

కొండపైకి నడిచి వెళ్లిన అఖిల్
X
సినిమా థియేటర్లలోకి రావడం ఒకెత్తు. వచ్చిన తర్వాత అది హిట్టవ్వడం మరో ఎత్తు. ఇలా ఎన్నో విఘ్నాలు దాటుకొని సినిమా సక్సెస్ అవ్వాలి. పైగా అఖిల్ లాంటి మోస్ట్ ఎవెయిటింగ్ మూవీపై అంచనాలు బాగా ఉంటాయి. అందరి చూపు దానిపైనే ఉంటుంది. పైగా ఇప్పటికే సినిమా ఓసారి పోస్ట్ పోన్ కూడా అయింది. అందుకేనేమో అఖిల్ మొక్కుకున్నాడు. కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న అఖిల్, ఈరోజు ఆ మొక్కు తీర్చుకున్నాడు. అలిపిరి నుంచి నడకదారిన తిరుమల చేరుకున్నాడు అఖిల్. అప్పటికే అక్కడ వీవీ వినాయక్ సిద్ధంగా ఉన్నాడు. వీళ్లతో పాటు మిగతా టీం అంతా కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు అఖిల్ విడుదలవుతున్న నేపథ్యంలో అఖిల్ స్వామివారిని దర్శించుకున్నాడు. టీటీడీ అధికారులు అఖిల్ అండ్ టీంకు తీర్థప్రసాదాలు అందజేశారు.
First Published:  10 Nov 2015 6:48 PM GMT
Next Story