Telugu Global
Cinema & Entertainment

అలీ భార్య అంతరంగం

ఈమధ్య కాలంలో సినిమాలో కామెడీ రోల్స్ కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయిపోయాడు అలీ. తను అడుగుపెట్టిన ప్రతి షోలో డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడం, అక్కడున్న యాంకర్లు, హీరోయిన్లను ఏదో ఒకటి అనడం  అలీకి అలవాటు. వినడానికి ఆ డైలాగులు ఎబ్బెట్టుగా అనిపించినా, అలీ ఎక్స్ ప్రెషన్స్ చూడ్డానికి చిరాకు తెప్పించినా ప్రేక్షకులు కూడా ఎడ్జెస్ట్ అయిపోయారు. అయితే రీసెంట్ గా చెలరేగిన వివాదం మాత్రం అలీకి బాగానే దెబ్బేసింది. సైజ్ జీరో ఆడియో ఫంక్షన్ […]

అలీ భార్య అంతరంగం
X
ఈమధ్య కాలంలో సినిమాలో కామెడీ రోల్స్ కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయిపోయాడు అలీ. తను అడుగుపెట్టిన ప్రతి షోలో డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడం, అక్కడున్న యాంకర్లు, హీరోయిన్లను ఏదో ఒకటి అనడం అలీకి అలవాటు. వినడానికి ఆ డైలాగులు ఎబ్బెట్టుగా అనిపించినా, అలీ ఎక్స్ ప్రెషన్స్ చూడ్డానికి చిరాకు తెప్పించినా ప్రేక్షకులు కూడా ఎడ్జెస్ట్ అయిపోయారు. అయితే రీసెంట్ గా చెలరేగిన వివాదం మాత్రం అలీకి బాగానే దెబ్బేసింది. సైజ్ జీరో ఆడియో ఫంక్షన్ లో అనుష్క తొడలకు నేను పెద్ద ఫ్యాన్స్ అంటూ అలీ చేసిన కామెంట్ వివాదాస్పదమైంది. దీంతో అలీ ఆమధ్య బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. అంతా ఉత్తుత్తిదే.. జస్ట్ ఫర్ ఫన్.. ఐయామ్ సారీ అంటూ తప్పించుకున్నాడు. మొత్తం ఎపిసోడ్ పై తాజాగా అలీ భార్య జుబేదా కూడా స్పందించారు. తన భర్తది మహిళలను కించపరిచే మనస్తత్వం కాదంటున్నారు జుబేదా. ఆయన పక్కా జెంటిల్ మేన్ అంటున్నారు. ఆయన ఎంత సున్నిత మనష్కుడో క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసంటున్నారు. ఏదేమైనా తాజా వివాదం మాత్రం అలీ మాటల ప్రవాహానికి చిన్నసైజు స్పీడ్ బ్రేకర్ లా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
First Published:  11 Nov 2015 12:06 AM GMT
Next Story