Telugu Global
Others

వైసీపీకి గుడ్‌బై చెప్పినట్టేనా ?

విశాఖ జిల్లా అరకు వ్యాలీ వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆ పార్టీ చర్చ జరుగుతోంది. అసలు ఆయన పార్టీలో ఉంటారా లేక జంప్ అవుతారా అన్న దానిపై నేతలు చర్చించుకుంటున్నారు. వీరికి ఈ అనుమానం రావడానికి కారణం ఇటీవల సర్వేశ్వరరావు వ్యవహార శైలే. గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈయనకు రాజకీయ గురువైన కొణతాల రామకృష్ణ పార్టీని వీడిన తర్వాత ఈ ధోరణి ఎక్కువైందంటున్నారు. ఇటీవల విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ […]

వైసీపీకి గుడ్‌బై చెప్పినట్టేనా ?
X

విశాఖ జిల్లా అరకు వ్యాలీ వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై ఆ పార్టీ చర్చ జరుగుతోంది. అసలు ఆయన పార్టీలో ఉంటారా లేక జంప్ అవుతారా అన్న దానిపై నేతలు చర్చించుకుంటున్నారు. వీరికి ఈ అనుమానం రావడానికి కారణం ఇటీవల సర్వేశ్వరరావు వ్యవహార శైలే. గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈయనకు రాజకీయ గురువైన కొణతాల రామకృష్ణ పార్టీని వీడిన తర్వాత ఈ ధోరణి ఎక్కువైందంటున్నారు.

ఇటీవల విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు కూడా ఆయన హాజరుకావడం లేదు. కేవలం బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్నారే గానీ స్వయంగా పెద్దగా ఇన్‌వాల్వ్ కావడం లేదు. దీంతో ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని వైసీపీ నేతలు కూడా ఓ అంచనాకు వచ్చారు. అయితే సర్వేశ్శరరావు వైసీపీని వీడి ఏం చేస్తారన్న దానిపైనా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వైసీపీని వీడిన తర్వాత కొణతాల రామక‌ృష్ణ టీడీపీలో చేరిపోవడం ఖాయమనుకున్నారు. కానీ అక్కడ లోకల్ పాలిటిక్స్ కారణంగా టీడీపీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. ఎలాగైనా కొణతాలను పార్టీలోకి తీసుకురావాలని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రయత్నిస్తున్నారు.అలా చేయడం ద్వారా దాడి వీరభద్రరావు తిరిగి టీడీపీలోకి రాకుండా అడ్డుకోవచ్చని మంత్రి ఆలోచన అని చెబుతున్నారు. ఒకవేళ టీడీపీలో రామకృష్ణ ఎంట్రీ ఓకే అయితే ఆయనతో పాటు సర్వేశ్వరరావు టీడీపీలోకి చేరిపోతారని సమాచారం.

బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో అరకు ఎమ్మెల్యే టీడీపీలో చేరితే ప్రభుత్వానికి మంచే జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు లెక్కలేస్తున్నారు. సర్వేశ్వరరావు 2007లో వైఎస్ ఎమ్మెల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎంతో మంది పోటీలో ఉన్నా వారందరినీ కాదని సర్వేశ్వరరావుకు జగన్ టికెట్ ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కొణతాల మాటకే కట్టుబడుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సర్వేశ్వరరావు నోరు విప్పితే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

First Published:  11 Nov 2015 3:20 AM GMT
Next Story