Telugu Global
Others

అనంత‌లో ఆ ఎమ్మెల్యే అంటే హ‌డ‌ల్

ఆయ‌నో అధికార పార్టీ ఎమ్మెల్యే… మొద‌టిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.. కానీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా ఆయ‌న‌కు క‌మిష‌న్ ఇవ్వాల్సిందే… అదేదో 5 శాతం 10 శాతం కాదు.. ఏకంగా 40 శాతం. 40 శాతం క‌మిష‌న్ ఇవ్వ‌క‌పోతే నువ్వెలా ప‌నులు చేస్తావో చూస్తానంటూ డైర‌క్టుగా వార్నింగులిస్తాడు. చిన్నా చిత‌కా కాంట్రాక్ట‌ర్ల‌నే కాదు… ఏకంగా రిల‌యెన్స్ వంటి బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌ను సైతం బెదిరించ‌గ‌ల స‌త్తా మ‌నోడి సొంతం. అస‌లే ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం… ఆపై అధికార‌పార్టీ. ఎందుకులే అని […]

అనంత‌లో ఆ ఎమ్మెల్యే అంటే హ‌డ‌ల్
X
ఆయ‌నో అధికార పార్టీ ఎమ్మెల్యే… మొద‌టిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.. కానీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా ఆయ‌న‌కు క‌మిష‌న్ ఇవ్వాల్సిందే… అదేదో 5 శాతం 10 శాతం కాదు.. ఏకంగా 40 శాతం. 40 శాతం క‌మిష‌న్ ఇవ్వ‌క‌పోతే నువ్వెలా ప‌నులు చేస్తావో చూస్తానంటూ డైర‌క్టుగా వార్నింగులిస్తాడు. చిన్నా చిత‌కా కాంట్రాక్ట‌ర్ల‌నే కాదు… ఏకంగా రిల‌యెన్స్ వంటి బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌ను సైతం బెదిరించ‌గ‌ల స‌త్తా మ‌నోడి సొంతం. అస‌లే ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం… ఆపై అధికార‌పార్టీ. ఎందుకులే అని చాలామంది అన్నీ మూసుకుని అడిగిన క‌మిష‌న్ ఇస్తున్నారు.. ఇవ్వ‌లేనోళ్లు టెండ‌ర్లు ర‌ద్దు చేసుకుని వెళుతున్నారు. ఇటీవ‌ల ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి హైవే విస్త‌ర‌ణ ప‌నులు ప్రారంభ‌మ‌య్యారు.. ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ గ్రిడ్ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. హైవే విస్త‌ర‌ణ ప‌నులు ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్ కు ఆ ఎమ్మెల్యే ఏకంగా ఇటీవ‌ల‌ అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌ల ముందే ఫోన్ చేసి 40 శాతం క‌మిష‌న్ క‌ట్టు… లేకుంటే ప‌నులెలా చేస్తావో చూస్తానంటూ హుకూం జారీ చేశార‌ట‌. రిల‌యెన్స్ ఫైబ‌ర్ గ్రిడ్ వ‌ర్క్స్ లైన్లు త‌వ్వుతున్న వారికి సైతం ఫోన్ చేసి ముందు క‌మిష‌న్ క‌ట్టు.. లేకుంటే ప‌నులు జ‌ర‌గ‌నివ్వ‌న‌న్నార‌ట‌. దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఇదెవ‌రి కాంట్రాక్టో తెలుసా? రిల‌యెన్స్ అంబానీది.. అన్నార‌ట‌. ఓహో అలాగా… నీపైన నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు న‌మోదు చేయిస్తా… అనిల్ అంబానీతో ఫోన్ చేయించుకుని కేసు కొట్టేయించుకో అన్నార‌ట‌. దాంతో షాక్ తిన్న ఆ రిల‌యెన్స్ కాంట్రాక్ట‌ర్… ప‌ర్సెంటేజీ త‌గ్గించ‌మ‌ని కాళ్ల బేరానికి వ‌చ్చార‌ట‌. ఇక ఇసుక రీచుల్లో మ‌నోడి ఆదాయం లెక్క‌బెట్ట‌డానికి వీలు కాదంటున్నారు. రోజు ఎంత‌లేద‌న్నా క‌నీసం 20 లారీల ఇసుక‌ను బెంగుళూరుకు చేరుస్తూ దండిగా సంపాయిస్తున్న ఆ ఎమ్మెల్యేని ఇటీవ‌ల విలేక‌రులు ఏంట‌న్నా? ఆరోప‌ణ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని అడిగితే…. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఇప్ప‌టి నుంచి సంపాయించ‌క‌పోతే ఎట్టా? అన్నార‌ట‌. దాంతో విలేక‌రులు కూడా నోరెళ్ల‌బెట్టాల్సి వ‌చ్చింది.
First Published:  10 Nov 2015 9:09 PM GMT
Next Story