Telugu Global
Cinema & Entertainment

నన్ను వివాదాల్లోకి లాగకండి " క‌మ‌ల్ హాస‌న్

ఐదేళ్లకొక్కసారి కొందరు కావాలనే నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు. విమర్శిస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే నా పూర్వీకాన్నే విమర్శిస్తున్న భావన నాకు కలుగుతోంది. నా సిద్ధాంతాల గురించి ఇప్పటికే చాలా సార్లు వెల్లడించాను. నేను రాజకీయవాదిని కాదు. రాజకీయాల్లోకి ఇకపై వచ్చే ఆలోచనా లేదు. అలాగే నేను నాస్తికుడిని. ఆస్తికుడి కాలేను. అలాగని ఆస్తికత్వాన్ని వ్యతిరేకించను. నాకు స్వర్గం ఇక్కడే, నరకం ఇక్కడే. రెండింటినీ ఇక్కడే అనుభవిస్తాను. ఒక అతీంద్రీయ శక్తులున్న మాంత్రికుడు ఎదురయితే షేక్‌హ్యాండ్ ఇస్తాను అంతేగానీ […]

నన్ను వివాదాల్లోకి లాగకండి  క‌మ‌ల్ హాస‌న్
X

ఐదేళ్లకొక్కసారి కొందరు కావాలనే నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు. విమర్శిస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే నా పూర్వీకాన్నే విమర్శిస్తున్న భావన నాకు కలుగుతోంది. నా సిద్ధాంతాల గురించి ఇప్పటికే చాలా సార్లు వెల్లడించాను. నేను రాజకీయవాదిని కాదు. రాజకీయాల్లోకి ఇకపై వచ్చే ఆలోచనా లేదు. అలాగే నేను నాస్తికుడిని. ఆస్తికుడి కాలేను. అలాగని ఆస్తికత్వాన్ని వ్యతిరేకించను. నాకు స్వర్గం ఇక్కడే, నరకం ఇక్కడే. రెండింటినీ ఇక్కడే అనుభవిస్తాను. ఒక అతీంద్రీయ శక్తులున్న మాంత్రికుడు ఎదురయితే షేక్‌హ్యాండ్ ఇస్తాను అంతేగానీ నమస్కారం చేయను. దేవుళ్లు అనే వారిని ఒక పక్క ఉండనీ యండి. పశుమాంసం తినడం గురించి పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ విషయంలో ఎవరి ఇష్టాలను వారికి వదిలేయండి. ఏమేమి తినాలో మెనూ ఇవ్వకండి. నా మాటల్లో న్యాయం ఉంటుంది.

అవార్డు వ్యవహారంలో రాద్దాంతం వద్దు
అవార్డులు వెనక్కి ఇవ్వనన్న నా నిర్ణయంపై విమ‌ర్శలు చేస్తున్నారు. అసలు అవార్డులు ప్రభుత్వం ఇచ్చేవి కావు. 12 మంది ప్రముఖుల సమిష్టి నిర్ణయంతో అందించేవి. వాటిని వెనక్కి ఇచ్చి వారిని అవమాన పరచలేను. అయినా అవార్డులు తిరిగి ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు. ఇకపోతే నా స్వాతంత్య్రాని కి భంగం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. గొంతెత్తుతాను.

గాంధీకి స్నేహితుడిని..
నా తల్లి కాంగ్రెస్ వాది. తండ్రి గాంధీజీ భక్తుడు. నేను గాంధీజీ స్నేహితుడ్ని. అయినా నాకు రాజ కీయాలు తెలియవు. నేను జ్ఞానిని కాదు. జ్ఞా నాన్ని సేకరించేవాడిని. స్వచ్ఛ భారత్‌లో నన్ను భాగం చేసినందుకు గర్వపడుతున్నాను. అది దేశానికి మంచి చేసే కార్యక్రమం. అలాంటి కారర్యక్రమాలకు ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా పాల్గొంటాను. మనం ఇప్పుడు దేశభక్తిని దాటి ప్రపంచభక్తి వైపు దూసుకెళుతున్నాం. నా అభిమానులే నా బలం. వారితో నా సేవాకార్యక్రమా లు కొనసాగుతాయి. నాకు అగ్నిపరిక్ష పెట్టకండి. అని 61 వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం సాయంత్రం నగరంలోని అన్నా ఆడిటోరియంలో 37వ అఖిల ఇండియా కమలహాసన్ సేవా సంఘం నిర్వహించిన సమావేశంలో విశ్వనటుడు కమలహాసన్ ఆవేశంగా మాట్లాడారు.ఇదే వేదికపై దేశ నలుమూల నుంచి వచ్చిన తన అభిమానులు పరమకుడిలోని ఆయన చదివిన‌ పాఠశాల అభివృద్ధి కోసం అందించిన విరాళాలను కమలహాసన్ ఆ పాఠశాల నిర్వాహకులకు అందజేశారు. అభిమానులందరికీ కమల్ జ్ఞాపికలను అందజేశారు.

First Published:  11 Nov 2015 12:06 AM GMT
Next Story