Telugu Global
Others

మయన్మార్‌లో అంగ్‌సాన్ సూకీ పార్టీ విజయకేతనం

నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాభిప్రాయానికి బ్యాలెట్ బాక్స్‌ బెదిరిపోయింది. యావత్ ప్రజానీకం పూరించిన స్వేచ్ఛా శంఖారావానికి ఎన్నికల రణరంగమే తల వంచింది. పార్లమెంట్‌లో మొత్తం 664 స్థానాలు ఉండగా, దిగువసభలోని 440 సీట్లకుగాను అంగ్‌సాన్‌ సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీ 150 సీట్లు సాధించి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా ప్రాంతీయ అసెంబ్లీ ఫలితాలు ప్రకటించిన 260 స్థానాలకుగాను 233 సీట్లలో ఎన్‌ఎల్‌డీ పార్టీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. జాతీయ […]

మయన్మార్‌లో అంగ్‌సాన్ సూకీ పార్టీ విజయకేతనం
X

నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాభిప్రాయానికి బ్యాలెట్ బాక్స్‌ బెదిరిపోయింది. యావత్ ప్రజానీకం పూరించిన స్వేచ్ఛా శంఖారావానికి ఎన్నికల రణరంగమే తల వంచింది. పార్లమెంట్‌లో మొత్తం 664 స్థానాలు ఉండగా, దిగువసభలోని 440 సీట్లకుగాను అంగ్‌సాన్‌ సూకీ పార్టీ ఎన్‌ఎల్‌డీ 150 సీట్లు సాధించి ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా ప్రాంతీయ అసెంబ్లీ ఫలితాలు ప్రకటించిన 260 స్థానాలకుగాను 233 సీట్లలో ఎన్‌ఎల్‌డీ పార్టీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. జాతీయ చట్ట సభలో తమ పార్టీకి 75 శాతం సీట్లు వస్తాయని సూకీ ఆశాభావంతో ఉన్నారు.
మయన్మార్‌ అధ్యక్షురాలిగా తనకు పోటీ చేసే అర్హత లేకుండా రాజ్యాంగం రూపొందించినా, మిలటరీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆమె అన్నారు. కాగా, పాలక మిలటరీ అండతో అధికారంలో ఉన్న యూఎస్‌డీపీ ఓటమిని అంగీకరించింది. ‘‘మా పార్టీ పరాజయాన్ని అంగీకరిస్తున్నాం. ఎన్‌ఎల్‌డీ గెలిచింది’’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత కీ విన్‌ వ్యాఖ్యానించారు. ఇక యాంగాన్‌ రాష్ట్ర అసెంబ్లీలోని 90 సీట్లలో 87 స్ధానాలను దక్కించుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. అయినా ప్రజల్లో ఒకరకమైన భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

1990లో కూడా అంగ్‌సాన్‌ సూకీ పార్టీ విజయదుందుబి మోగించింది. అప్పట్లో సూకీ పార్టీ 59 శాతం ఓట్లతో పార్లమెంటులో 81 శాతం సీట్లను సాధించింది. కానీ ఆనాటి మిలటరీ పాలన ఈ ఎన్నికలు చెల్లవని ప్రకటించింది. ఇపుడు కూడా ఫలితాల వెల్లడి పూర్తయిన తర్వాత మిలటరీ పాలకులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య విజయాన్ని నమోదు చేసిన ఆంగ్‌ సాన్‌ సూకీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశమైన చైనాతో పాటు మరికొన్ని దేశాలు సూకీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. డభ్బై సంవత్సరాల అంగ్‌సాన్‌ సూకీ 1945లో జన్మించారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు గృహ నిర్బంధంలో ఉన్నారు.

First Published:  10 Nov 2015 9:55 PM GMT
Next Story