Telugu Global
Cinema & Entertainment

ఒక్క పాటకు 75 లక్షలు తీసుకుంది

ఒక్క పాట.. ఒకే ఒక్క పాట.. సినిమాలో కేవలం 5 నిమిషాలు వచ్చే పాట.. అలాంటి పాట కోసం దాదాపు 75 లక్షల రూపాయలు తీసుకుంది మిల్కీబ్యూటీ తమన్న. ఆమె పారితోషికంలో దాదాపు ఇది సగం ఎమౌంట్. ఆ ఒక్క పాట కోసం ఆమెకు అంతివ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు నిర్మాత బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కొడుకు సాయిశ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐటెంసాంగ్ కోసం తమన్నకు […]

ఒక్క పాటకు 75 లక్షలు తీసుకుంది
X
ఒక్క పాట.. ఒకే ఒక్క పాట.. సినిమాలో కేవలం 5 నిమిషాలు వచ్చే పాట.. అలాంటి పాట కోసం దాదాపు 75 లక్షల రూపాయలు తీసుకుంది మిల్కీబ్యూటీ తమన్న. ఆమె పారితోషికంలో దాదాపు ఇది సగం ఎమౌంట్. ఆ ఒక్క పాట కోసం ఆమెకు అంతివ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు నిర్మాత బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ కొడుకు సాయిశ్రీనివాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐటెంసాంగ్ కోసం తమన్నకు ఇంత ఆఫర్ చేశాడు బెల్లంకొండ. సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. కేవలం 3 రోజుల్లో పాట కంప్లీట్ అయింది.. 5 నిమిషాల డ్యూరేషన్.. పారితోషికం మాత్రం దాదాపు 75లక్షల రూపాయలట. దీంతో అంతా అవాక్కయ్యారు. అంత ఎమౌంట్ ఇస్తే బాలీవుడ్ హాట్ స్టార్లే ఐటెంసాంగ్ చేయడానికి ముందుకొస్తారు. కానీ బెల్లంకొండ మాత్రం తమన్నానే కావాలని పట్టుబట్టాడు. ఎందుకంటే.. శ్రీనివాస్ నటించిన తొలి సినిమాలో కూడా తమన్నానే ఐటెంభామ. అందుకే సెంటిమెంట్ కొద్దీ రెండో సినిమాలో కూడా ఆమెనే తీసుకున్నాడు. ఈ రెండో సినిమా కూడా హిట్టయితే.. తమన్న జాక్ పాట్ కొట్టినట్టే.. ఎందుకంటే సెంటిమెంట్ ప్రకారం మూడో సినిమాలో కూడా ఆఫర్ వస్తుంది కదా..
First Published:  10 Nov 2015 7:20 PM GMT
Next Story