Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు వారసుల ఫ్లాప్ ఎంట్రీ

అఖిల్ సినిమా థియేటర్లలో అదరగొడుతుందని అనుకున్నారంతా. ఎంతమంది అనుకున్నా అనుకోకపోయినా నాగార్జున మాత్రం గట్టిగా అనుకున్నాడు. కానీ నాగ్ ఆశలకు గండికొట్టింది అఖిల్ మూవీ. తొలి రోజు, తొలి ఆట నుంచే అఖిల్ సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం ప్రారంభమైంది. ఫ్లాపులొస్తే కుంగిపోవడం అక్కినేని కాంపౌండ్ కు తెలియదు. ఫ్లాపుల నుంచి మరిత నేర్చుకొని ముందుకెళ్లడం ఆ కాంపౌండ్ హీరోలకు అలవాటు. అయితే ఈసారి మాత్రం నాగ్ కొంచె డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే.. అఖిల్ ఎంట్రీని […]

ఇద్దరు వారసుల ఫ్లాప్ ఎంట్రీ
X
అఖిల్ సినిమా థియేటర్లలో అదరగొడుతుందని అనుకున్నారంతా. ఎంతమంది అనుకున్నా అనుకోకపోయినా నాగార్జున మాత్రం గట్టిగా అనుకున్నాడు. కానీ నాగ్ ఆశలకు గండికొట్టింది అఖిల్ మూవీ. తొలి రోజు, తొలి ఆట నుంచే అఖిల్ సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం ప్రారంభమైంది. ఫ్లాపులొస్తే కుంగిపోవడం అక్కినేని కాంపౌండ్ కు తెలియదు. ఫ్లాపుల నుంచి మరిత నేర్చుకొని ముందుకెళ్లడం ఆ కాంపౌండ్ హీరోలకు అలవాటు. అయితే ఈసారి మాత్రం నాగ్ కొంచె డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకంటే.. అఖిల్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశాడు కింగ్. కానీ అది సక్సెస్ కాలేకపోయిందనే బాధ నాగ్ లో కనిపిస్తోంది. అన్నింటికంటే మించి, తన ఇద్దరు కొడుకుల‌ ఎంట్రీల్లో ఏదీ సక్సెస్ కాకపోవడం నాగార్జునను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. పెద్దకొడుకు నాగచైతన్య ఎంట్రీని కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. కానీ జోష్ సినిమా బాగా ఆడలేదు. కనీసం చిన్న కొడుకు అఖిల్ ఎంట్రీతోనైనా ఆ బాధను తీర్చుకుందామనుకున్నాడు నాగార్జున. కానీ అఖిల్ ఎంట్రీ కూడా సోసోగానే జరిగిపోయింది. దీంతో ఇద్దరు కొడుకుల్లో ఎవరి ఎంట్రీని గ్రాండ్ గా ఇవ్వలేకపోయానని బాధపడుతున్నాడట నాగ్.
First Published:  11 Nov 2015 7:03 PM GMT
Next Story