Telugu Global
Others

అమరావతి నిర్మాణానికి బ్రిటన్‌ సాయం

ఆంధ్రపదేశ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సహకరిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ తెలిపారు. ఈనగరంతోపాటు పూణే, ఇండోర్‌ నగరాల అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. భారత్‌తో బ్రిటన్ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి 9 బిలియన్ పౌండ్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య పౌరు అణు ఒప్పందం కూడా కుదిరింది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ భారత్‌-బ్రిటన్‌ మధ్య కొత్త […]

అమరావతి నిర్మాణానికి బ్రిటన్‌ సాయం
X

ఆంధ్రపదేశ్‌ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సహకరిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ తెలిపారు. ఈనగరంతోపాటు పూణే, ఇండోర్‌ నగరాల అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. భారత్‌తో బ్రిటన్ అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి 9 బిలియన్ పౌండ్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య పౌరు అణు ఒప్పందం కూడా కుదిరింది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ భారత్‌-బ్రిటన్‌ మధ్య కొత్త ఆర్థిక బంధం ఏర్పడిందని అన్నారు. భద్రతా మండలిలో భారత్‌ సభ్యత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ప్రకటించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా ఇద్దరు ప్రధానుల సమక్షంలో ద్వైపాక్షిక చర్చలు జరిగిన అనంతరం మోదీ, కామెరూన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాలు సృష్టించడంతో పాటు ప్రజలను ఉగ్రవాదం నుంచి కాపాడేందుకు కట్టుబడి ఉంటామని కామెరూన్ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా ఉంటూ ఉగ్రవాదాన్ని అణచివేయాలని మోదీ పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని తమ దేశ కంపెనీలను కోరతామన్నారు. భారత్‌లో సైబర్ క్రైం యూనిట్ ఏర్పాటు చేసి పది లక్షల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. బ్రిటన్ పార్లమెంట్‌‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. బ్రిటన్ పార్లమెంట్ బయట గాంధీజీ విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా బ్రిటీషువారు తెలివైనవారని నిరూపించుకున్నారని చెప్పారు.

First Published:  12 Nov 2015 12:38 PM GMT
Next Story