Telugu Global
Others

ఈడీ దాడి ప్రతీకారమేనా?

దీపావళి రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెళ్లి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను విచారించడం వెనుక రాజకీయ కోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం పనిగట్టుకుని చేయిస్తున్న కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. షారుక్‌ఖాన్‌కు, బీజేపీకి వివాదం ఏటింటంటే… ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా షారుక్ దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కమలనాథులకు మండేలా చేసింది. ఆ రోజే బీజేపీ […]

ఈడీ దాడి ప్రతీకారమేనా?
X

దీపావళి రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెళ్లి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను విచారించడం వెనుక రాజకీయ కోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం పనిగట్టుకుని చేయిస్తున్న కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

షారుక్‌ఖాన్‌కు, బీజేపీకి వివాదం ఏటింటంటే… ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా షారుక్ దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కమలనాథులకు మండేలా చేసింది. ఆ రోజే బీజేపీ నేతలు మూకుమ్మడిగా షారుక్‌పై మాటల దాడి చేశారు. షారుక్ పాకిస్తాన్ ఏజెంట్ అని విమర్శించారు. ఖాన్ ఇండియాలో ఉన్నా మనసు మాత్రం పాకిస్టాన్‌లో ఉందంటూ మరో బీజేపీ నేత కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు షేర్ల బదిలీలో అక్రమాలు జరిగాయంటూ ఈడీ అధికారులు వెళ్లడం కూడా బీజేపీ ప్రతికారదాడే అంటున్నారు. ‘దీపావళి రోజున షారూఖ్ ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారా లేక మనసులో ఉన్నది ఆయన మాట్లాడారని టార్గెట్ చేశారా? . ప్రభుత్వ ప్రతీకారం చర్యలకు ఈడీ కొత్త ఆయుధంగా మారిందా?’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివలా కూడా ప్రశ్నించారు. అయితే షారుక్‌ చేసిన ఆర్థిక అక్రమాలపై ఈడీ విచారణ జరుపుతోందని.. అందులో తప్పేముందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  12 Nov 2015 2:03 AM GMT
Next Story