Telugu Global
Others

కోళ్ళఫారాలను తలపిస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ళు: రావెల

కొన్ని కార్పొరేట్‌ స్కూళ్ళు కోళ్ళఫారాలను తలపిస్తున్నాయని, వీటి కంటే ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలే చాలా మెరుగ్గా ఉంటున్నాయని ఏపీ రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఏలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్రీడోత్సవాల ప్రారంభానికి వచ్చిన ఆయన కార్పొరేట్‌ స్కూళ్ళ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కార్పొరేట్‌ స్కూళ్ళు ఎంతో అధ్వాన్నంగా నడుస్తున్నాయని, వాటిలో చదువు తప్ప వేరే ప్రపంచమే ఉండడం లేదని, యువత పెడదారిని పట్టడానికి ఇలాంటి స్కూళ్ళే కారణమని […]

కోళ్ళఫారాలను తలపిస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ళు: రావెల
X

కొన్ని కార్పొరేట్‌ స్కూళ్ళు కోళ్ళఫారాలను తలపిస్తున్నాయని, వీటి కంటే ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలే చాలా మెరుగ్గా ఉంటున్నాయని ఏపీ రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఏలూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్రీడోత్సవాల ప్రారంభానికి వచ్చిన ఆయన కార్పొరేట్‌ స్కూళ్ళ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కార్పొరేట్‌ స్కూళ్ళు ఎంతో అధ్వాన్నంగా నడుస్తున్నాయని, వాటిలో చదువు తప్ప వేరే ప్రపంచమే ఉండడం లేదని, యువత పెడదారిని పట్టడానికి ఇలాంటి స్కూళ్ళే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆట లేక, పాట లేక, కళలు లేక కార్పొరేట్‌ స్కూళ్ళు పిల్లల్ని యంత్రాల్లా తయారు చేస్తున్నాయని, ప్రభుత్వ స్కూళ్ళనే సరిగా వినియోగించుకుంటే అద్భుత ఫలితాలతోపాటు ఆటాపాటా, వ్యాయామం వంటి అదనపు ప్రయోజనాలు చేకూరతాయని ఆయన అన్నారు. కార్పొరేట్‌ స్కూళ్ళ వ్యవహారంపై రావెల వ్యాఖ్యలు కలకలం సృష్టించనున్నాయి. ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ళపై రావెల చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కాక పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  12 Nov 2015 12:52 PM GMT
Next Story