Telugu Global
Others

టిప్పు వేలికి రాముడి ఉంగరం!

కోహినూర్‌ వజ్రంతోపాటు టిప్పు సుల్తాన్ చనిపోయేనాటికి ఆయన వేలికి రాముడి ముద్రతో ఉన్న ఉంగరం కూడా తెచ్చి టిప్పుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బీజేపీ కార్యకర్తలకు చూపాలని, అప్పుడే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముస్లింలు నమ్ముతారని, బీజేపీ కార్యకర్తలకు టిప్పుపై ఉన్న అపోహలు తొలగి పోతాయని ఉత్తరప్రదేశ్‌ మంత్రి అజంఖాన్‌ అన్నారు. 18 శతాబ్దంలో మైసూర్‌ను పాలించిన టిప్పు సుల్తాన్‌ ధరించిన రామ ముద్రతో ఉన్న ఉంగరం బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్నట్టు ప్రధాని మోదీ చెబుతున్నారని, అదే నిజమైతే దాన్ని […]

టిప్పు వేలికి రాముడి ఉంగరం!
X

కోహినూర్‌ వజ్రంతోపాటు టిప్పు సుల్తాన్ చనిపోయేనాటికి ఆయన వేలికి రాముడి ముద్రతో ఉన్న ఉంగరం కూడా తెచ్చి టిప్పుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బీజేపీ కార్యకర్తలకు చూపాలని, అప్పుడే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముస్లింలు నమ్ముతారని, బీజేపీ కార్యకర్తలకు టిప్పుపై ఉన్న అపోహలు తొలగి పోతాయని ఉత్తరప్రదేశ్‌ మంత్రి అజంఖాన్‌ అన్నారు. 18 శతాబ్దంలో మైసూర్‌ను పాలించిన టిప్పు సుల్తాన్‌ ధరించిన రామ ముద్రతో ఉన్న ఉంగరం బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్నట్టు ప్రధాని మోదీ చెబుతున్నారని, అదే నిజమైతే దాన్ని కూడా తీసుకురావాలని ఆయన డిమాండు చేశారు. ఎలిజిబెత్‌ మహారాణి -2తో విందు చేస్తున్న మోదీ ఆమె కిరీటంలో పొదిగి ఉన్న కోహినూర్‌ వజ్రాన్ని అడగాలని, అలాగే ఈ ఉంగరాన్ని కూడా తెచ్చేందుకు బ్రిటన్‌ ప్రధానమంత్రి కామెరూన్‌ ఒప్పించాలని అజంఖాన్‌ సూచించారు. మాజీ సైనికోద్యోగులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయానికి తాను మద్దతిస్తున్నట్టు ప్రకటిస్తూ… మోదీ సైనికులతో దీపావళి జరుపుకోవడం గొప్ప విషయం కాదని, మాజీ సైనికులకు ఒన్‌ ర్యాంకు-ఒన్‌ పెన్షన్‌ను వారు కోరిన విధంగా అమలు చేసిననాడే వారికి నిజమైన దీపావళి అని అజంఖాన్‌ అభివర్ణించారు.

First Published:  12 Nov 2015 10:41 AM GMT
Next Story