రామ్ సినిమా టైటిల్ మారింది

రీసెంట్ గా శివమ్ తో ఫ్లాప్ అందుకున్నాడు రామ్. త్వరలోనే తన కొత్త సినిమా హరికథను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నాడు రామ్. హరికథ అనే టైటిల్ కంటే కాస్త సాఫ్ట్ గా ఉండే మరో పేరు పెట్టాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు శైలజ. ఆ పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది. కాబట్టి మూవీకి నా పేరు శైలజ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. దాదాపు ఈ పేరుకు ఫిక్స్ అయిపోయారు. సరైన టైమ్ చూసి టైటిల్ ను, ఫస్ట్ లుక్ తో పాటు విడుదల చేస్తారు. కొత్త కుర్రాడు కిషోర్ దర్శకత్వంలో నాపేరు శైలజ సినిమా తెరకెక్కుతోంది. స్రవంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నారు  ఈ సినిమాని. మూవీ ఫస్ట్ కాపీ వచ్చేనెలకు సిద్ధమైపోతుంది. సినిమాను కూడా డిసెంబర్ లోనే విడుదల చేయాలని మొదట భావించారు. అయితే సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి.