Telugu Global
Others

త్వరలో టీఎస్ టెట్ నోటిఫికేషన్

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేన్లు విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో జోష్ నింపుతోంది. మరోవైపు టీచర్ పోస్టు భర్తీకి కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఖాళీగా టీచర్ పోస్టులను భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం జనవరి నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ రెడీ అవుతోంది. టెట్ నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. […]

త్వరలో టీఎస్ టెట్ నోటిఫికేషన్
X
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేన్లు విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో జోష్ నింపుతోంది. మరోవైపు టీచర్ పోస్టు భర్తీకి కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఖాళీగా టీచర్ పోస్టులను భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం జనవరి నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ రెడీ అవుతోంది. టెట్ నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. టెట్ పరీక్ష జనవరి 24 నిర్వహించాలని ఇటీవల జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా.. టీచర్ పోస్టుల భర్తీ జరగబోతంది. దీంతో ఈసారి అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కనీసం ఐదు లక్షల మంది అభ్యర్దులు టెట్ కు అప్లై చేస్తారని భావిస్తున్నారు. ప్రతి పరీక్షలో తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. సైన్స్ గ్రూపులను ఎంచుకొని డిగ్రీ, బిఈడిలు పూర్తి చేసిన అభ్యర్థులకు టెట్ సోషల్ సబ్జెక్ట్ విషయంలో అనుమతించే విషయంపైనా త్వరలోనే నిర్ణయాన్ని తీసుకోనుంది. ఈసారికైతే ఎన్‌సిఈఆర్‌టీఇ ఆదేశాల ప్రకారం టెట్‌ పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టుల భర్తికి విద్యాశాఖ సిద్ధమవుతుండడంతో బీఈడీ, టీటీసీ అభ్యర్థులంతా ప్రిపరేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు.
First Published:  11 Nov 2015 7:10 PM GMT
Next Story