Telugu Global
Others

గల్లా వారికి రూ. 43 కోట్ల ల్యాండ్ గిఫ్ట్!

చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవలే సీఆర్‌డీఏ పరిధిలో బాలయ్య వియ్యంకుడికి 500 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టిన బాబు సర్కార్ ఇప్పుడు తన పార్టీకే చెందిన గల్లా ఫ్యామిలీపై అమితప్రేమ కనబరిచింది. రూ. 43 కోట్ల విలువైన భూమిని కేవలం నాలుగు కోట్ల 88 లక్షలకే కట్టేబెట్టేశారు. గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు ఈ భూమిని అప్పగించారు. కడప- తిరుపతి రహదారిలో వెంబడి ఉన్న కరకంబాడి వద్ద ఈ భూమి […]

గల్లా వారికి రూ. 43 కోట్ల ల్యాండ్ గిఫ్ట్!
X

చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవలే సీఆర్‌డీఏ పరిధిలో బాలయ్య వియ్యంకుడికి 500 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టిన బాబు సర్కార్ ఇప్పుడు తన పార్టీకే చెందిన గల్లా ఫ్యామిలీపై అమితప్రేమ కనబరిచింది. రూ. 43 కోట్ల విలువైన భూమిని కేవలం నాలుగు కోట్ల 88 లక్షలకే కట్టేబెట్టేశారు. గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు ఈ భూమిని అప్పగించారు. కడప- తిరుపతి రహదారిలో వెంబడి ఉన్న కరకంబాడి వద్ద ఈ భూమి ఉంది. 21. 69 ఎకరాల భూమిని ఎకరాకు 22. 50 లక్షలతో కట్టబెట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది

గల్లా కుటుంబానికి ప్రభుత్వం అప్పగించిన భూమి రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి బస్టాండ్‌కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ భూమి విలువ కోట్లలో పలుకుతోంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఇక్కడ ఎకరం భూమి విలువ రెండున్నర కోట్లకుపైగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 22. 50 లక్షలకే కట్టబెట్టిసింది. కేవలం 42 రోజుల్లోనే ధరఖాస్తు నుంచి భూ కేటాయింపు వరకు మొత్తం ప్రక్రియను పూర్తి చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి గల్లా కుటుంబం భారీగా పార్టీ ఫండ్ఇచ్చిందని అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు చంద్రబాబు భూమి కేటాయించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

గతంలో మంత్రిగా ఉన్న సమయంలో గల్లా అరుణకుమారి ఈ భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించగా అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదని చెబుతుంటారు. ఇప్పుడు మాత్రం గల్లా అరుణ్ కుమారి కుటుంబం అనుకున్నది సాధించింది. అయితే భూకేటాయింపుల కోసం ఇప్పటికే భారీగా ధరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.. కానీ వాటన్నింటిని కాదని గల్లా ఫైల్ మాత్రం శరవేగంగా ముందుకు దూసుకెళ్లింది.

First Published:  12 Nov 2015 11:27 PM GMT
Next Story