Telugu Global
International

అంగసాన్‌ సూకీకి అద్భుత మెజారిటీ!

మయన్మార్‌ సాయుధ పాలన నుంచి మరికొన్ని రోజుల్లో పూర్తిగా విముక్తం కానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ అత్యద్భుత మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం పార్లమెంటు స్థానాల్లో 80 శాతం కైవసం చేసుకుంది. 1990 నుంచి సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌ తన అధికారాన్ని ఎన్‌ఎల్‌డీకి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. 1990లో కూడా ఎన్‌ఎల్‌డీ 52 శాతం సీట్లను సాధించి పార్లమెంటులో మెజారిటీ సంపాదించినప్పటికీ […]

అంగసాన్‌ సూకీకి అద్భుత మెజారిటీ!
X

మయన్మార్‌ సాయుధ పాలన నుంచి మరికొన్ని రోజుల్లో పూర్తిగా విముక్తం కానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ అత్యద్భుత మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం పార్లమెంటు స్థానాల్లో 80 శాతం కైవసం చేసుకుంది. 1990 నుంచి సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌ తన అధికారాన్ని ఎన్‌ఎల్‌డీకి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. 1990లో కూడా ఎన్‌ఎల్‌డీ 52 శాతం సీట్లను సాధించి పార్లమెంటులో మెజారిటీ సంపాదించినప్పటికీ అప్పట్లో సైనికాధిపతి ఆ ఎన్నికలు చెల్లవని ప్రకటించి సూకీని గృహ నిర్భంధంలో ఉంచారు. చానాళ్ళ తర్వాత మళ్ళీ ఇపుడు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ సూకీకి చెందిన పార్టీ ఎన్‌ఎల్‌డీయే 80 శాతం సీట్లు సాధించి జయకేతనం ఎగురవేసింది. ఇప్పటికే 348 సీట్లు సాధించింది. మరికొన్ని సీట్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన బలం చేకూరింది. ఎగువ, దిగువ సభల్లో సూకీ పార్టీకే మెజారిటీ లభించడంతో అధ్యక్ష ఎన్నికకు, ఆ తర్వాత ప్రభుత్వ రూపకల్పనకు మార్గం సుగమమైంది.

First Published:  13 Nov 2015 10:46 AM GMT
Next Story