పవన్‌ని బాబు ఇలా అవుట్‌ చేసాడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ల భేటీ సారాంశం ఏమిటి? విజయాడ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వారిద్దరు మాత్రమే ఏకాంతంగా రెండు గంటలపాటుఏమి చర్చించారు? వారిరువురికి సయోధ్య కుదిర్చిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా దగ్గర లేకుండా పవన్‌-చంద్రబాబు మాత్రమే మాట్లాడుకున్న విశేషాలేమిటి? దీనిపైనే ఇపుడు అందరూ చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రిని కలిసే సందర్భం ఇపుడు పవన్‌కు ఏమీలేదు. కానీ గతకొంత కాలంగా తెలుగుదేశం-బిజెపిల మధ్య రాష్ట్రంలో తీవ్రస్థాయిలో విభేదాలునెలకొన్నాయి. వీటిని నివారించడం ఇపుడు సాధ్యమయ్యే స్థితిలో లేదు. ఇరు పార్టీలు కూడా ఆత్మరక్షణలో పడిపోయాయి. ఈపరిణామాలు ఇలాగే కొనసాగితే ఇరుపార్టీలూ నష్టపోతాయనేది అర్థమయింది. ఇంకో మూడున్నరేళ్ల సమయం ఉందికాబట్టి ఈలోగా ఏమైనాజరగవచ్చనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.

పవన్‌ పర్యటన సాధించిందేమిటి?
పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రితో ఏమి మాట్లాడారు? రెండు గంటల పాటు వారిద్దరూ చర్చించుకున్న అంశాలేమిటి? సమావేశం అనంతరం పవన్‌ విలేకరులతో మాట్లాడిన అంశాలే వారిద్దరూ మాట్లాడుకున్నారా? అంటే కాదనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన అంశాలకూ, లోపల చంద్రబాబుతో మాట్లాడిన అంశాలకు సంబంధం లేకుండానే ఉన్నాయి. పవన్‌ను సాదరంగాఆహ్వానించినచంద్రబాబు తన రూములోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ కుశలప్రశ్నలు వేసుకున్నారు. రాష్ట్రాభివృద్దిలో తానురేయింబవళ్లు ఎంత కష్ట పడేది ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాన్‌కు వివరించారు. దేశ,విదేశీ ప్రముఖులు, ఆయా దేశాల ప్రభుత్వాలు ఏవిధంగా స్పందిస్తున్నాయో ఫొటోలు,వీడియోల రూపంలో వివరించారు. ఇప్పటి వరకూ ఆయా దేశాల కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలనూ చూపించారు. రాష్ట్రాభివృద్దిపై తనకున్న విజన్‌ ఏమిటో వివరించారు.

కేంద్ర ప్రభుత్వం తనపట్ల,రాష్ట్రం పట్ల వ్యవహరించే విధానం గురించి కూడా చంబ్రాబు పవన్‌కు క్షుణ్ణంగా వివరించారు.అక్టోబరు 22వ తేదీన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహించామో,దేశవిదేశీ ప్రతినిధులు ఎంతగా స్పూర్తిపొందారో చంద్రబాబు పవన్‌కు తెలిపారు. అయినప్పటికీ కేంద్రంమాత్రంకనికరించలేదు…ప్రధాని వచ్చారు..వెళ్లారుఅన్నట్లే ఉంది తప్ప ఎలాంటిప్రకటనా చేయలేదు…రాష్ట్రప్రజలంతా చాలా నిరాశచెందారు. ఇప్పటికే ప్రత్యేక హోదావిషయంలో తనపై ఎంతో వత్తిడి వస్తోంది. కేంద్రం ఇచ్చిన మాట తప్పినా,,,ఏదో విధంగా నేనుకవర్‌చేస్తున్నా…అయినా కేంద్రం సహకరించడం లేదు..అని పవన్‌కు తన బాధను చెప్పుకోవడం చంద్రబాబు వంతు అయింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాను అమరావతి రాజధానికోసం శ్రమిస్తుంటే మీరు కూడా(పవన్‌) రైతుల పక్షాన నిలబడతాననడం, భూసేకరణ చేస్తే పోరాటం చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాజధానికోసం 31 వేల ఎకరాల భూమిని సేకరించాం. ఇంకా రెండున్నర వేల ఎకరాల భూమికే ఇబ్బంది ఉంది. ఆయా ప్రాంత రైతులు మొండికేస్తున్నారు. గతంలో మీరుఅమరావతి ప్రాంతంలో చేసిన పర్యటన తర్వాత రైతుల్లో మరింత మొండితనం వచ్చింది. దీంతో రెండున్నర వేల ఎకరాలనుసేకరించడం ఇబ్బంది అవుతుంది. దీన్ని క్యాబినేట్‌ సమావేశంలో కూడా చర్చించాం. భూసేకరణ చట్టం ద్వారా ఆ భూమిని తీసుకుందామని మంత్రి వర్గం నిర్ణయించింది. భూనోటిఫికేషన్‌ విడుదలచేద్దామనేఅనుకున్నాం. కానీ మీ స్పందన ఎలా ఉంటుందో అనిఆగాం. మీరు ఈ విషయంలో అడ్డుపడితే రాజధాని నిర్మాణానికి ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద వ్యవస్థను నిర్మించేటప్పుడు కొన్ని అవాంతరాలువస్తాయి.అన్నింటినీ పట్టించుకుంటే రాజకీయాల్లో ముందుకు వెళ్లలేము. అనిచంద్రబాబు పవన్‌కు వివరించారు.

పవన్‌ ఫ్లైట్‌ ఖర్చు ఎవరిది?
పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనతో పాటు మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. అయితే ఈ విమానం ఎవరుసమకూర్చారు? అయిన ఖర్చునుఎవరు భరించారు? ప్రభుత్వమే ఈ వ్యవహారం అంతా నడిపిందా? దీనివెనుక కథనడిపిందెవరు? అన్నవి ఇపుడు చర్చనియాంశాలుగా మారాయి. ముఖ్యమంత్రే తన వ్యధనుచెప్పుకోవడానికి పవన్‌ను పిలిపించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇపుడున్న పనరిస్థితుల్లో పవన్‌ కళ్యాణ్‌ అవసరం సి.ఎం.కుచాలా ఉంది. రాజధాని ప్రాంతంలో మిగిలిన భూసేకరణచేయాలంటే పవన్‌ అడ్డుపడకుండా చూసుకోవాలి. దీనికి చంద్రబాబే పవన్‌ దగ్గరకు వెళ్లడం అనేది ఇబ్బందికరమైన అంశం. అందుకే బిజెపికిచెందిన కామినేని శ్రీనివాస్‌ను రంగంలోకి దింపి చంద్రబాబు తన వ్యూహాన్నిమరోసారి చాటుకున్నారు. ప్రత్యేకమైన విమానంలో పవన్‌ను రప్పించేప్రయత్నంచేసి పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు.