భవనంపై నుంచి పడి నటుడు మృతి… వివాహేతర సంబంధమే కారణం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో నటుడు ప్రశాంత్‌  దుర్మరణం పాలయ్యారు.  వివాహేతర సంబంధమే ఇతడి ప్రాణం తీసింది. ప్రశాంత్ కూకట్‌పల్లిలో ఓ మహిళతో వివాహేతరసంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.. ఆమెతో ఉన్న సమయంలో మహిళ సోదరుడు రావడంతో  భవనం ఆరో అంతస్తు నుంచి రెండు అంతస్తులు క్షేమంగా దిగాడు ఆ తరువాత పైప్‌లైన్‌ పట్టుకుని దిగే ప్రయత్నంలో  జారి  అంత ఎత్తు నుంచి కిందపడడంతో ప్రశాంత్ తలపగిలి అక్కడికక్కడే చనిపోయాడు.

తన ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న ప్రియురాలి భర్త లేకపోవడంతో ప్రకాంత్ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. అయితే ఆ సమయంలో సోదరుడు రావడంతో భయాందోళనకు గురైన ఆమె ప్రశాంత్‌ను ఇంట్లోనే దాచిపెట్టింది. అనుమానం వచ్చిన సోదరుడు తనిఖీ చేస్తుండగా.. ప్రియురాలు చేతులు కోసుకొని రభస చేసింది. దీంతో చుట్టుప్రక్కలవాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వెళ్తూవెళ్లూ ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీంతో ప్రశాంత్   ఇంటి వెనక వైపు ఉన్న  పైప్‌ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడు.

‘ఇప్పట్లో రాముడు, సీతలా ఎవరుంటారండీ బాబు’ అనే సినిమాలో ప్రశాంత్‌ హీరోగా నటించాడు. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఉంటూ నటుడిగా మారాడు. ప్రశాంత్‌ ది అనంతపురం జిల్లా గుంతకల్లు సొంతూరు.