Telugu Global
CRIME

'ఆమెకు' ఆటైంలో ఆటలేంటి?: కర్ణాటక హోంమంత్రి

అత్యాచారానికి గురైన ముఫ్పై యేళ్ళ మహిళకు రాత్రిపూట ఆటలేంటి అంటూ కర్ణాటక కొత్త హోం మంత్రి జి. పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిందితుల్ని వదిలేసి బాధితురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ మంత్రి వైఖరిపై మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బెంగుళూరులోని కబ్బన్‌ పార్క్‌కు సమీపంలోని టెన్నిస్‌ క్లబ్‌కు రాత్రి 9.30 గంటల సమయంలో మెంబర్‌షిప్‌ తీసుకోవడం కోసం వెళ్ళిన ఆమెను తర్వాత రోజు రమ్మని క్లబ్‌ వర్గాలు చెప్పి పంపాయి. సరిగ్గా […]

ఆమెకు ఆటైంలో ఆటలేంటి?: కర్ణాటక హోంమంత్రి
X

అత్యాచారానికి గురైన ముఫ్పై యేళ్ళ మహిళకు రాత్రిపూట ఆటలేంటి అంటూ కర్ణాటక కొత్త హోం మంత్రి జి. పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నిందితుల్ని వదిలేసి బాధితురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ మంత్రి వైఖరిపై మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బెంగుళూరులోని కబ్బన్‌ పార్క్‌కు సమీపంలోని టెన్నిస్‌ క్లబ్‌కు రాత్రి 9.30 గంటల సమయంలో మెంబర్‌షిప్‌ తీసుకోవడం కోసం వెళ్ళిన ఆమెను తర్వాత రోజు రమ్మని క్లబ్‌ వర్గాలు చెప్పి పంపాయి. సరిగ్గా ఈ సమయంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆమె వద్దకు వచ్చి సభ్యత్వం తీసుకోవడానికి తాము సహకరిస్తామని నమ్మించి ఆమెను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటక హోం శాఖ మంత్రులు ఇలాంటి సంఘటనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గత నెల 8వ తేదీన అప్పటి హోం శాఖ మంత్రి కె.జె. జార్జి కూడా ఇలాంటి ప్రకటనే చేయడంతో హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. 22 యేళ్ళ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై టెంపో ట్రావెలర్‌ చేసిన అత్యాచారానికి సంబంధించి అప్పటి హోంమంత్రి జార్జి ‘అది సామూహిక అత్యాచారం ఎలా అవుతుంది?. ఇద్దరు చేస్తే దాన్ని సామూహిక అత్యాచారం అంటారా? సామూహిక అత్యాచారం అంటే కనీసం ముగ్గురు చేయాలి’ అంటూ ఆయన కొత్త భాష్యం చెప్పారు. అలాగే కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యాచారాలను నియంత్రించక పోతే మీరేం చేస్తారని ఓ విలేఖరి బీజేపీ నాయకుడు ఈశ్వరప్పను ప్రశ్నించగా… ‘నిన్ను ఇక్కడ నుంచి ఎవరో తీసుకుపోయి అత్యాచారం చేస్తారు. దానికి ప్రతిపక్షం ఏం చేస్తుంది?’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇలా కర్ణాటకలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై రాజకీయ పార్టీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఒకే బాటలో పయనిస్తున్నాయి.

First Published:  13 Nov 2015 8:16 AM GMT
Next Story