Telugu Global
Others

లండన్‌లో మోడీకి భారతీయుల నిరసన

లండన్‌ పర్యటనలో మోడీని బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుంటే, ఆయనకు కొందరు భారతీయులనుంచే నిరసనల సెగలు తగిలాయి. లండన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులు కొందరు డౌనింగ్‌ స్ట్రీట్‌లో మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు. గుజరాతీయులు, సిక్కులతోపాటు వివిధ భారతరాష్ట్ర్రాలకు చెందినవాళ్ళు, నేపాలీయులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం భారతదేశంలో వివిధ వర్గాల మధ్య చిచ్చుపెడుతోందని, మోడీ విధానాలు భారత ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శిస్తూ ప్రదర్శన జరిపారు. “కిల్లర్‌ మోడీ” అని, “మోడీ గోబ్యాక్‌” […]

లండన్‌లో మోడీకి భారతీయుల నిరసన
X

లండన్‌ పర్యటనలో మోడీని బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుంటే, ఆయనకు కొందరు భారతీయులనుంచే నిరసనల సెగలు తగిలాయి.
లండన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులు కొందరు డౌనింగ్‌ స్ట్రీట్‌లో మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు. గుజరాతీయులు, సిక్కులతోపాటు వివిధ భారతరాష్ట్ర్రాలకు చెందినవాళ్ళు, నేపాలీయులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం భారతదేశంలో వివిధ వర్గాల మధ్య చిచ్చుపెడుతోందని, మోడీ విధానాలు భారత ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శిస్తూ ప్రదర్శన జరిపారు. “కిల్లర్‌ మోడీ” అని, “మోడీ గోబ్యాక్‌” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

First Published:  13 Nov 2015 3:00 AM GMT
Next Story