Telugu Global
Others

పెద్దాయన ఇప్పుడు లేచారేంటి?

చాలాకాలంగా మౌనంగా ఉన్న పీసీసీ మాజీ చీఫ్ ఎం సత్యనారాయణ రావు తీరా వరంగల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేశారు. కేసీఆర్‌పై పొగడ్తలు కురిపించి కాంగ్రెస్ నేతలకు షాక్‌ ఇచ్చారు. కేసీఆర్‌ బాగా పనులు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి, విద్యుత్ అంశాల్లో సీఎం కేసీఆర్ విధానాలు బాగానే ఉన్నాయన్నారు. అంతేకాదు కేసీఆర్ మంచి పనులు కాంగ్రెస్ నేతలు స్వాగతించాలని ఓ సలహా కూడా పడేశారు. మరీ వన్‌సైడ్‌గా పొగిడితే బాగోదనుకున్నారో ఏమో […]

పెద్దాయన ఇప్పుడు లేచారేంటి?
X

చాలాకాలంగా మౌనంగా ఉన్న పీసీసీ మాజీ చీఫ్ ఎం సత్యనారాయణ రావు తీరా వరంగల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేశారు. కేసీఆర్‌పై పొగడ్తలు కురిపించి కాంగ్రెస్ నేతలకు షాక్‌ ఇచ్చారు. కేసీఆర్‌ బాగా పనులు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి, విద్యుత్ అంశాల్లో సీఎం కేసీఆర్ విధానాలు బాగానే ఉన్నాయన్నారు. అంతేకాదు కేసీఆర్ మంచి పనులు కాంగ్రెస్ నేతలు స్వాగతించాలని ఓ సలహా కూడా పడేశారు. మరీ వన్‌సైడ్‌గా పొగిడితే బాగోదనుకున్నారో ఏమో కేసీఆర్ కూడా దూకుడు తగ్గించుకోవాలని అటువైపుకూ ఓ సలహా పడేశారు ఎమ్మెస్సార్.

కేసీఆర్ పాలన బాగానే ఉంది… కాంగ్రెస్ నేతలు కూడా దాన్ని స్వాగతించాలని ఎమ్‌ఎస్‌ఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. టైమింగ్‌ ఏమిటి?, ఆ కామెంట్స్ ఏమిటని మండిపడుతున్నారు. వరంగల్‌ ఎన్నికల్లో తాము కిందమీదపడి పోరాడుతుంటే గట్టు మీద కూర్చొని కామెంట్స్‌ ఏమిటని రగిలిపోతున్నారు. కావాలనే కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఈ వ్యాఖ్యలు చేశారేమోనని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా వయసులో పెద్దోడు… సీనియర్ నేత ఆయన్ను మేం ఏం చేయగలమని మరికొందరు నేతలు సద్దుకుపోయే ధోరణి ప్రదర్శిస్తున్నారు.

First Published:  13 Nov 2015 5:28 AM GMT
Next Story