Telugu Global
Others

అగ్రజులకు అండగా రాజ్‌నాథ్

బిహార్ ఓటమి ప్రకంపనలు బీజేపీలో ఇంకా ఆగడం లేదు. బిహార్ ఓటమి సమిష్టి బాధ్యత అంటూ తప్పించుకోవడం కుదరదంటూ మోదీ, అమిత్ షాలపై అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంతకుమార్ బహిరంగ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కమలనాథులు తర్జనభర్జన పడుతున్నారు. అద్వానీ బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ నమ్మినబంటుల బృందం డిమాండ్ చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం సీనియర్లకు అండగా నిలిచారు. అద్వానీ […]

అగ్రజులకు అండగా రాజ్‌నాథ్
X

బిహార్ ఓటమి ప్రకంపనలు బీజేపీలో ఇంకా ఆగడం లేదు. బిహార్ ఓటమి సమిష్టి బాధ్యత అంటూ తప్పించుకోవడం కుదరదంటూ మోదీ, అమిత్ షాలపై అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంతకుమార్ బహిరంగ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కమలనాథులు తర్జనభర్జన పడుతున్నారు. అద్వానీ బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ నమ్మినబంటుల బృందం డిమాండ్ చేస్తోంది.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం సీనియర్లకు అండగా నిలిచారు. అద్వానీ తదితరులపై చర్యలు ఏ మాత్రం సమంజసం కాదని పార్టీ అగ్రనేతలకు తేల్చిచెప్పారు. బీజేపీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దాని వెనుక సీనియర్ నేతల కృషి కూడా ఉందని గుర్తు చేశారు. కాబట్టి చర్యల ఆలోచన మానుకోవాలని సూచించారు. సీనియర్లు చెప్పిన అంశాలపైనా దృష్టి సారించి వాటిని సరిదిద్దుకోవడమే ఉత్తమమని చెప్పినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సీనియర్లు ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని కూడా రాజ్‌నాథ్ అబిప్రాయపడ్డట్టు సమాచారం.

కేంద్ర మంత్రి గడ్కరి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో మరికొందరు మాత్రం అద్వానీ బ‌ృందంపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. మోదీ ప్రధాని అవడం జీర్ణించుకోలేకే కొందరు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని యడ్యూరప్ప మండిపడ్డారు. వెంకయ్యనాయుడు కూడా బిహార్ ఓటమికి మోదీని నిందించడం సరికాదని చెప్పారు. సీనియర్లు మాట్లాడాలనుకుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లోనే అభిప్రాయాలు చెప్పాలని అద్వానీ లాంటి సీనియర్ నేతలకు వెంకయ్య సలహా ఇచ్చారు. మొత్తం మీద అద్యానీ బృందంపై ఎలా వ్యవహరించాలన్న విషయంలో పార్టీ నేతలు రెండు వర్గాలు చీలినట్టు కనిపిస్తోంది.

First Published:  13 Nov 2015 12:32 AM GMT
Next Story