Telugu Global
CRIME

రష్యన్‌ యువతిపై వారణాసిలో యాసిడ్‌ దాడి

రష్యన్‌ యువతిపై వారణాసిలో యాసిడ్‌ దాడి జరిగింది. తనతో వివాహాన్ని నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆమె ముఖం, కళ్ళు, చేతులు, కొన్ని శరీర భాగాలపై యాసిడ్‌ పడి బాగా దెబ్బ తిన్నాయి. వారణాసిలోని నందనగర్‌ కాలనీలో హృదయ్‌లాల్‌ శ్రీవత్సవ ఇంటిలో ఈ రష్యన్‌ యువతి దరియ యురీవా పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటోంది. శ్రీవత్సవ మనువడు సిద్ధార్థ శ్రీవత్సవ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తాను నిద్ర పోతుండగా యాసిడ్‌ […]

రష్యన్‌ యువతిపై వారణాసిలో యాసిడ్‌ దాడి
X

రష్యన్‌ యువతిపై వారణాసిలో యాసిడ్‌ దాడి జరిగింది. తనతో వివాహాన్ని నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆమె ముఖం, కళ్ళు, చేతులు, కొన్ని శరీర భాగాలపై యాసిడ్‌ పడి బాగా దెబ్బ తిన్నాయి. వారణాసిలోని నందనగర్‌ కాలనీలో హృదయ్‌లాల్‌ శ్రీవత్సవ ఇంటిలో ఈ రష్యన్‌ యువతి దరియ యురీవా పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటోంది. శ్రీవత్సవ మనువడు సిద్ధార్థ శ్రీవత్సవ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తాను నిద్ర పోతుండగా యాసిడ్‌ దాడి జరిపినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. తనను పెళ్ళి చేసుకోమని బలవంతం చేశాడని, దానికి తాను అంగీకరించ లేదని, తన వీసా గడువు ముగిసిపోతున్నందు వల్ల కొద్ది రోజుల్లో వెళ్లిపోతున్నట్లు చెప్పడంతో కోపగించుకున్న సిద్ధార్థ తనపై దాడి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె కళ్ళు బాగా దెబ్బతిన్నాయని, మూడు రోజుల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్‌ సర్జన్‌ కూడా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రష్యన్‌ కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఆమె కోలుకునేందుకు మంచి వైద్యాన్ని అందించాలని, ఎంత ఖర్చయినా వెనుకాడ వద్దని జిల్లా మేజిస్ట్రేట్‌ను ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఢిల్లీ నుంచి కూడా కొంతమంది అధికారులను వారణాసి పంపించడానికి పీఎంఓ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే నిందితుడ్ని తక్షణం పట్టుకోవాలని కూడా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని పీఎంఓ ఆదేశించింది.

First Published:  13 Nov 2015 11:36 AM GMT
Next Story