చిరంజీవి కాద‌న్న సినిమాలో వ‌రుణ్‌తేజ్‌

అఖిల్ సినిమా త‌రువాత త‌న త‌రువాత ప్రాజెక్ట్ ను నాగబాబు కుమారుడు వ‌రుణ్‌తేజ్‌తో చేద్దామ‌ని అనుకుంటున్నాడంట ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్‌. తొలుత క‌త్తి సినిమా రీమేక్ కి మెగాస్టార్ చిరంజీవి అంగీక‌రించ‌డంతో ద‌ర్శ‌కుడిగా వి.వి. వినాయ‌క్‌ను అనుకున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన ఠాగూర్ ఘ‌న‌విజ‌యం సాధించింది. మ‌రోసారి ఈ ద్వ‌యం క‌లిసి ప‌నిచేస్తుంద‌న‌గానే అంచ‌నాలు పెరిగాయి. ఎందుకో.. ఏమో?  కానీ, చిరంజీవి ఈ సినిమాను కూడా ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. విజ‌య్ హీరోగా న‌టించిన ఈ సినిమా త‌మిళంలో భారీ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ అదే పేరుతో రీమేక్ చేద్దామ‌ని అనుకున్నారు.. విజ‌య్‌పాత్ర‌కు తాను న‌ప్పుతానో లేదో అన్న అనుమానం, దీనికితోడు రీమేక్‌లు ఎందుకంటూ కొందు ప్ర‌ముఖులు విమ‌ర్శిస్తుండ‌టంతో ఆయ‌న తెలుగు క‌థ కోసం చూస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్లో టాక్ మొద‌లైంది.
కంచెతో ఆక‌ర్షించాడు..!
కంచె సినిమాలో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు.. మెగా క్యాంప్ హీరో వ‌రుణ్ తేజ్‌. చిరంజీవి ఈ సినిమాను వ‌ద్ద‌నే స‌రికి వినాయ‌క్ బాగా డిస‌ప్పాయింట్ అయ్యాడ‌ట‌. కానీ, అదే టైమ్‌లో విడుద‌లైన కంచె సినిమా వినాయ‌క్‌కు ఊర‌ట ఇచ్చింది. క‌త్తి రీమేక్‌కు వ‌రుణ్ తేజ్ బాగా స‌రిపోతాడ‌ని ఫిక్స్ అయ్యాడ‌ట. పైగా న‌ట‌న‌ప‌రంగా ఇర‌గదీయ‌డంతో చిత్రంలోని సెంటిమెంట్ స‌న్నివేశాలు దంచేస్తాడ‌ని సంబ‌ర‌ప‌డ్డాడ‌ట వినాయ‌క్‌. దీంతో క‌త్తి తీస్తే.. వ‌రుణ్‌తేజ్ తోనే అని ఒట్టు పెట్టుకున్నాడ‌ట. ఇప్ప‌టికే ఈ మేర‌కు నాగ‌బాబు, వ‌రుణ్‌తేజ్‌లో సంప్ర‌దింపులు కూడా మొద‌ల‌య్యాయ‌ని స‌మాచారం. క‌త్తిలో వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తే.. చిరు కాకుంటే  అత‌ని త‌మ్ముడి కొడుకు తీస్తున్నాడ‌ని మెగా అభిమానులు కూడా సంబ‌ర‌ప‌డ‌తారండోయ్‌! మ‌రి, వ‌రుణ్ తేజ్ అయినా క‌త్తి దూస్తాడో?  లేదో అన్న‌ది వేచి చూడాలి.