Telugu Global
Others

ఆందోళనలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఇంకా ప్రభుత్వంలో పట్టు లభించలేదా? అభద్రతా భావంరోజురోజుకూపెరుగుతోందా? స్వపక్షంలోని వారు కూడా బాబుపై ఆగ్రహాన్ని పెంచుకుంటున్నారా? వీటన్నింటికీ అవుననే సమాధానం లభిస్తోంది.ముఖ్యమంత్రి అయినతర్వాత నుంచి చంద్రబాబు పోకడ చూస్తుంటే ఎవరికైనా ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో ఆయన ఎవరినీ నమ్మే స్థితిలో లేరని సన్నిహితులు పేర్కొంటున్నారు. దశాబ్దకాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించినతర్వాత తీవ్ర అసహనం,అలజడి,ఆందోళనలతోనే పాలన చేస్తున్నారు. అటుపార్టీలో గానీ, […]

ఆందోళనలో చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఇంకా ప్రభుత్వంలో పట్టు లభించలేదా? అభద్రతా భావంరోజురోజుకూపెరుగుతోందా? స్వపక్షంలోని వారు కూడా బాబుపై ఆగ్రహాన్ని పెంచుకుంటున్నారా? వీటన్నింటికీ అవుననే సమాధానం లభిస్తోంది.ముఖ్యమంత్రి అయినతర్వాత నుంచి చంద్రబాబు పోకడ చూస్తుంటే ఎవరికైనా ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుక్షణం అభద్రతాభావంతో ఆయన ఎవరినీ నమ్మే స్థితిలో లేరని సన్నిహితులు పేర్కొంటున్నారు. దశాబ్దకాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించినతర్వాత తీవ్ర అసహనం,అలజడి,ఆందోళనలతోనే పాలన చేస్తున్నారు. అటుపార్టీలో గానీ, ఇటు బంధువుల్లోగానీ ఎవరినీ నమ్మే స్థితిలో చంద్రబాబు లేరు. దీనికి ప్రధానమైన కారణం ఇటు స్వపక్షంలో గానీ,అటు మిత్రపక్షం(బిజెపి)లో గానీ బాబు ఎవరినీ పూర్తిస్థాయిలో నమ్మడంలేదు. చంద్రబాబు ఏకపక్షంగానే పాలనచేయడం, అంతాకుటుంబ పాలన అన్న రీతిలో ఉండటంతో ఇరు పక్షాలూ బాబుకు సహకరించడానికి విముఖత చూపుతున్నాయి. మరో వైపు రాష్ట్ర ఆర్థిక స్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. చంద్రబాబు, చినబాబుల వ్యవహారశైలి చూశాక మంత్రులు ఎవరి దారిలో వారు వెళుతున్నారు. ఎవరూ ఆత్మీయంగా దగ్గరచేరే స్థితిలో లేరు. కొందరిని కంట్రోల్‌ చేసే సాహసానికి చంద్రబాబు పూనుకోలేని విచిత్రమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. ఎంతో విజన్‌ వున్న బాబుగా ప్రకటించుకున్న చంద్రబాబు తన విషయంలో ఎలాంటి ముందుచూపు లేకుండా పాలన చేస్తున్నారనే అపవాదును సొంతం చేసుకుంటున్నారు.

స్వపక్షంలో ఎదురీత!
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు పార్టీని నిర్వహించడం ఏటికి ఎదురీత విధంగానే ఉండేది. దశాబ్దకాలంపాటు ప్రతిపక్షంలో ఉన్న బాబు అధికారం కోసం వేయికళ్లతో ఎదురు చూశారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌సిపి వేగానికి,ప్రజాదరణకు వణికి పోయారు. అధికారానికి మరోసారి దూరంగా వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఆయన సర్వశక్తుల్ని ఒడ్డారు. అచరణ సాధ్యంకాని హామీలను గుప్పించారు.చావో రేవో తేల్చుకునే స్థాయికి వెళ్లారు. బిజెపితో పొత్తు లేదంటూనే తప్పని పరిస్థితుల్లో పొత్తు,పవన్‌కళ్యాణ్‌ రాక,కాపులకు వరాలు,రుణమాఫీ వంటి ఆకర్షణీయ హామీలతో గెలుపొందారు. ప్రమాణస్వీకారం రోజున పెట్టిన ఐదు సంతకాలకు ఇప్పటికీ పూర్తిస్థాయి కార్యాచరణకు నోచుకోకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.

దీనితో పాటు మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు తీవ్రంగా అధినేతపై ఆగ్రహంతో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఏపనిచేయాలన్నా అధినేతతో గానీ, ఆయన తనయుడు లోకేష్‌తో గానీ చర్చించి,అనుమతి తీసుకోవడం అనేది ఎవరికీ ఇష్టం లేకుండా పోయింది. ”ఎన్నికల్లో కోట్లరూపాయలుఖర్చుచేసిగెలిచాం.ఇప్పటికే రెండేళ్లు కావస్తోంది. సొంతానికి కాదు కదా..కనీసం నియోజకవర్గానికి కూడా ఎలాంటి పనిచేసుకోలేకపోయాం. ఇదే పరిస్థితి ముందు కూడా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వృధా” అని ఒక మంత్రి పేర్కొనడం విశేషం. పాలన కోసం శాఖలు కేటాయించారు. పేరుకు మంత్రి అనే తప్ప ఎక్కడా శాఖల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. దీంతో అధికారులు కూడా మాట వినే స్థితిలో లేరు. ఇంకా పదవి ఉండీ ఉపయోగం ఏమిటి? అని మరో మంత్రిప్రశ్నించారు. ఇలాంటి అంశాలే మంత్రి వర్గంలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది.ఇంకా ఎమ్మెల్యేలు,ఎంపీల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. వారిని కనీసం పట్టించుకునే స్థాయిలో అధినేత లేరన్న భావన ఎక్కువవుతోంది. దీంతో అధినేతపై అందరూ ఆగ్రహంతో ఉన్నారు.

సీనియర్‌ ఐఏఎస్‌లను, ఉన్నతాధికారులను చంద్రబాబు సరిగ్గా వినియోగించుకోవడంలేదని, అందరికి ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప, అనుభవజ్ఞులైన అధికారుల సలహాలు తీసుకోవడంలేదని, ఎంతో పరిపాలనా అనుభవం ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌లను పనికిమాలిన శాఖలకు పంపించి, అనుభవంలేని కుర్ర అధికారులను అందలం ఎక్కించడంకూడా సీనియర్‌లకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు, లోకేష్‌లలో ఎవరినిర్ణయాలవల్ల ఈ గందరగోళపరిస్థితి ఏర్పడుతోందో ఎవరికీ అర్ధం కావడంలేదు.

సహకరించని బిజెపి
గడచిన ఎన్నికల్లో మిత్రపక్షంగా వ్యవహరించిన బిజెపి ఇపుడు పూర్తిస్థాయిలో ప్రతిపక్షం పాత్ర పోషిస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇరుపార్టీల మధ్య సయోధ్య లేదు. ఇరు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బాహాబాహీకి తలపడే స్థాయికిచేరాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం అందకుండా చేయడమే బిజెపి నేతల ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి అందించే ప్రతి రూపాయినీ బిజెపి,ప్రధాని మోడీ ఖాతాలో జమఅయ్యేలా చూడాలనే పట్టుదలతో బిజెపి నేతలు ఉన్నారు. అదికూడా అరకొరగానే నిధులు అందేలా చూడాలన్నది బిజెపి నేతల వ్యూహంగా ఉంది. వారి వ్యూహంలో భాగంగానే అక్టోబరు 22వ తేదీన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడి మట్టి,నీరు తప్ప రూపాయి కూడా ప్రకటించకుండా వెనుదిరిగి వెళ్లడం వెనుక బిజెపి వ్యూహంగానే పేర్కొంటున్నారు. ఇదే విధానం ఇకముందు కూడా అమలవుతుందని భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అటు మిత్రపక్షంగా ఉన్న బిజెపి సహకరించక,ఇటు స్వపక్షంలో ఉన్న వారు వ్యతిరేకంగా మారడం, మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని స్థితి అన్నివెరసి చంద్రబాబుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. అమరావతి రాజధానిని ఎలా నిర్మించాలి? ప్రజలకు ఇచ్చిన మాట ఎలా నిలుపుకోవాలి? అన్నది ఇపుడు చంద్రబాబు అలజడికి కారణంగా పేర్కొంటున్నారు. వీటికితోడు చంద్రబాబు ఈసారి అధికారంలోకి వచ్చాక తనకోసం, తన సౌకర్యాలకోసం కోట్లాదిరూపాయలను మంచినీళ్లలా ఖర్చుచేయడం ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఈవిషయంలో ప్రజల అసంతృప్తి మీడియాలో వ్యక్తంకాకపోయినా చంద్రబాబు దృష్టికి వస్తూనేవుంది. దాంతో రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగాలేదని చెప్పినా ప్రజల్లో సానుభూతిలేదు. కేంద్రం ఏమీ సహాయంచేయడంలేదు అని మీడియాద్వారా ప్రజల మనస్సుల్లోకి ఎక్కించాలని చూసినా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కొందరు కేంద్రం ఎంతెంత సహాయంచేసింది, విడుదలచేసిన వందలకోట్ల నిధుల్ని వాడుకోకుండా ఎలా పక్కనపెడుతున్నది, వివిధ పథకాలకోసం కేంద్రంఇచ్చిన నిధుల్ని మాత్రమే ఖర్చుచేసి మ్యాచింగ్‌ గ్రాంటులనుకూడా ఎలా విడుదలచేయనిది లెక్కలతోసహా బీజేపీ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆర్థిక ఇబ్బందులపట్ల ప్రజల్లో సానుభూతి లేకపోవడం కూడా చంద్రబాబు అసహనానికి కారణం అవుతోంది.

First Published:  14 Nov 2015 1:29 AM GMT
Next Story