Telugu Global
CRIME

పారిస్‌పై ఉగ్రదాడి -150కి పైగా మృతులు

పారిస్ ఉగ్రదాడితో వణికిపోయింది. జాతీయ స్టేడియంతో సహా పలు రెస్టారెంట్లు, థియేటర్ల వద్ద జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు తెగబడ్డారు. దాదాపు  170 మంది చనిపోయారు. 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఆరుచోట్ల కాల్పులు, మూడుచోట్ల పేలుళ్లు జరిపారు. పారిస్‌ స్టేడియం దగ్గర రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి.  మగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చగా, మరో ఇద్దరు ఆత్మహుతి దాడిలో చనిపోయారు. దేశ సరిహద్దులను ఫ్రెంచి మిలటరీ మూసివేసింది. రెండో ప్రపంచ యుద్ధం […]

పారిస్‌పై ఉగ్రదాడి -150కి పైగా మృతులు
X

పారిస్ ఉగ్రదాడితో వణికిపోయింది. జాతీయ స్టేడియంతో సహా పలు రెస్టారెంట్లు, థియేటర్ల వద్ద జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు తెగబడ్డారు. దాదాపు 170 మంది చనిపోయారు. 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు ఆరుచోట్ల కాల్పులు, మూడుచోట్ల పేలుళ్లు జరిపారు. పారిస్‌ స్టేడియం దగ్గర రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. మగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చగా, మరో ఇద్దరు ఆత్మహుతి దాడిలో చనిపోయారు. దేశ సరిహద్దులను ఫ్రెంచి మిలటరీ మూసివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా ప్రాన్స్‌ దేశంలో అత్యయిక పరిస్థితి విధించింది.

మొదటగా టెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అత్యాధునిక తుపాకులు చేతపట్టుకున్న దుండగులు.. భోజనం చేస్తున్నవారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు చనిపోయారు. ఆ వెంటనే జాతీయ ఫుట్ బాల్ స్టేడియం స్టేడ్ డీ ఫ్రాన్స్ బయట మూడు శక్తివంతమైన పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఫ్రాన్స్, జర్మనీల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుతుండటంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసి ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోసిస్ హోలాండ్ కూడా అదే స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్నారు. అయితే అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇది జరిగిన కాసేపటికే లెవెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ థియేటర్ లోకి చొరబడ్డ దుండగులు.. ప్రేక్షకులపై ఏకబిగిన కాల్పులు జరిపారు. అక్కడ కనీసం 35 మందిని పొట్టనపెట్టుకున్నారు. అనంతరం సెంట్రల్ ఫ్రాన్స్ లోని బటాక్లాన్ కాన్సెర్ట్ హాలులోనూ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. అత్యధిక ప్రాణనష్టం ఇక్కడే జరిగినట్లు జరిగింది. బటాక్లాన్ సాంస్కృతిక ప్రదర్శన శాలలో సాయుధులు తూటాల వర్షం కురిపించారు. బందీలుగా చేసుకుని వందమందిని పొట్టన పెట్టుకున్నారు. బాంబులు పెట్టి ఒకేసారి 100 మందిని పేల్చేశారు. ఉగ్రవాదుల దాడి ఘటన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. పారిస్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు.

ఈసంఘటనను మానవత్వంపై దాడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అభివర్ణించారు. అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్న వారిని ఉపేక్షించకూడదని అన్నారు. ఆ దేశానికి అన్ని విధాల సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉగ్రదాడిని భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఇది తనను మానసికంగా చాలా బాధ పెట్టిందని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్‌ మెర్కల్‌ కూడా ఖండించారు.

First Published:  13 Nov 2015 10:39 PM GMT
Next Story