Telugu Global
National

అశోక్‌ సింఘాల్‌ ఆరోగ్య పరిస్థితి 'విషమం'

మరోసారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విశ్వహిందూ పరిషత్‌ నేత అశోక్‌ సింఘాల్‌ను గుర్గావ్‌లోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. 89 యేళ్ళ సింఘాల్‌ శ్వాసకోశ సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. నెల్లాళ్ళుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆయనకు ఇపుడు పరిస్థితి విషమించిందని తెలిపారు. గతనెల 20న శ్వాసకోశ సమస్యతో బాధపడిన సందర్భంగా కూడా ఇపుడు చేర్చిన మేదాంత ఆస్పత్రిలోనే చేర్చి ఆ తర్వాత ఆయన్ను అంబులెన్స్‌ విమానంలో దేశ […]

అశోక్‌ సింఘాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమం
X

మరోసారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విశ్వహిందూ పరిషత్‌ నేత అశోక్‌ సింఘాల్‌ను గుర్గావ్‌లోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. 89 యేళ్ళ సింఘాల్‌ శ్వాసకోశ సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. నెల్లాళ్ళుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆయనకు ఇపుడు పరిస్థితి విషమించిందని తెలిపారు. గతనెల 20న శ్వాసకోశ సమస్యతో బాధపడిన సందర్భంగా కూడా ఇపుడు చేర్చిన మేదాంత ఆస్పత్రిలోనే చేర్చి ఆ తర్వాత ఆయన్ను అంబులెన్స్‌ విమానంలో దేశ రాజధానికి తరలించారు. రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మళ్ళీ అనుకోకుండా శ్వాస అందకపోవడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ వ్యవస్థాగత ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి. నడ్డా ఆస్పత్రికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే విహెచ్‌పీ అంతర్జాతీయ శాఖ ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్‌ సింఘాల్‌, ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌లు కూడా ఆస్పత్రికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా ఈనెల 16వ తేదీ నుంచి విహెచ్‌పీ నిర్వహించ తలపెట్టిన చతుర్వేద్‌ స్వహకార్‌ యజ్ఞాన్ని, దీపావళి మిలాన్‌ కార్యక్రమాన్ని సింఘాల్‌ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసినట్టు విహెచ్‌పీ వర్గాలు తెలిపాయి.

First Published:  14 Nov 2015 12:43 PM GMT
Next Story