Telugu Global
International

ఆర్నెల్లపాటు హెచ్-1బీ వీసా సస్పెండ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి టెడ్‌ క్రూజ్ తన ప్రణాళికలతో ప్రచారంలో దూసుకు పోతున్నారు. ముఖ్యంగా అక్కడి నిరుద్యోగులను ఆకర్షించేందుకు ఆయన హెచ్-1బీ వీసాను ఆర్నెల్లపాటు రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ వీసాపై భారత్‌తోపాటు విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు పొంది, స్థానికులను నిరుద్యోగులుగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరు నెలలపాటు హెచ్-1బీ వీసాను నిలుపుదల చేసి, వలస చట్టాల్ని సంస్కరించాల్సిన అవసరముందన్నారు. క్రూజ్ ప్రతిపాదనను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ తీవ్రంగా […]

ఆర్నెల్లపాటు హెచ్-1బీ వీసా సస్పెండ్
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి టెడ్‌ క్రూజ్ తన ప్రణాళికలతో ప్రచారంలో దూసుకు పోతున్నారు. ముఖ్యంగా అక్కడి నిరుద్యోగులను ఆకర్షించేందుకు ఆయన హెచ్-1బీ వీసాను ఆర్నెల్లపాటు రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ వీసాపై భారత్‌తోపాటు విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు పొంది, స్థానికులను నిరుద్యోగులుగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరు నెలలపాటు హెచ్-1బీ వీసాను నిలుపుదల చేసి, వలస చట్టాల్ని సంస్కరించాల్సిన అవసరముందన్నారు. క్రూజ్ ప్రతిపాదనను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదివరకే అమెరికన్ నిరుద్యోగులకు హెచ్-1బీ ఉద్యోగులకంటే తక్కువ వేతనాలిచ్చినా ఫర్వాలేదన్న క్రూజ్, తాజాగా హెచ్-1బీ వీసాలను నిలుపుదల చేయాలని ప్రతిపాదించడాన్ని తప్పుపట్టింది.

First Published:  15 Nov 2015 12:12 PM GMT
Next Story