Telugu Global
Others

అనాథల కోసం ఓ ఐటీ ఎనలిస్ట్‌ టీ స్టాల్!

అనాధలను, ఆటిజం ఉన్న పిల్లలను ఆదుకునేందుకు ఓ ఐటీ ఎనలిస్ట్‌ ఫుట్‌పాత్‌పై టీ స్టాల్ ప్రారంభించింది. కొంతమంది స్నేహితులను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి మానవత్వం చాటుకునే చర్యల్లో భాగంగా… తనవంతు సేవగా ఇలా ఆమె ముందడుగు వేసింది. టీ స్టాల్‌ ప్రాంగణంలో పాటలు పాడుతూ కొంతమంది ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అక్కడికి వెళ్లగానే సంగీతంతో స్వాగతం పలికి వెల్‌కమ్ టు ఐ ఫౌండేషన్ టీ స్టాల్ అంటూ ఆహ్వానిస్తారు. చిన్న టేబుల్, రెండు టీ ప్లాస్క్‌లు, టేబుల్‌కు […]

అనాథల కోసం ఓ ఐటీ ఎనలిస్ట్‌ టీ స్టాల్!
X

అనాధలను, ఆటిజం ఉన్న పిల్లలను ఆదుకునేందుకు ఓ ఐటీ ఎనలిస్ట్‌ ఫుట్‌పాత్‌పై టీ స్టాల్ ప్రారంభించింది. కొంతమంది స్నేహితులను ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి మానవత్వం చాటుకునే చర్యల్లో భాగంగా… తనవంతు సేవగా ఇలా ఆమె ముందడుగు వేసింది. టీ స్టాల్‌ ప్రాంగణంలో పాటలు పాడుతూ కొంతమంది ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అక్కడికి వెళ్లగానే సంగీతంతో స్వాగతం పలికి వెల్‌కమ్ టు ఐ ఫౌండేషన్ టీ స్టాల్ అంటూ ఆహ్వానిస్తారు. చిన్న టేబుల్, రెండు టీ ప్లాస్క్‌లు, టేబుల్‌కు చిన్న ఫ్లెక్సీ మాత్రమే అక్కడ ఉంటాయి. ఇక్కడ మసాలా, ప్లెయిన్ 2 రకాల టీలు అందుబాటులో ఉంటాయి. చిరునవ్వుతో సభ్యులు ఆర్డర్లు తీసుకుంటారు. మట్టి గ్లాసు(గురిగి), పేపర్ గ్లాసుల్లో టీ ఇస్తారు. టీ షాపుతో వస్తున్న డబ్బులను ఆటిజం పిల్లల ఉన్నత విద్యకు ఉపయోస్తున్నారు.

ఐ సపోర్ట్ ఫౌండేషన్‌ను 25 యేళ్ళ జూహి తన చెల్లితో కలిసి ఈ టీస్టాల్‌ను ప్రారంభించింది. 2014లో ఒక్కరితో ప్రారంభమైన ఆటిజం స్కూల్‌లో ప్రస్తుతం 45 మంది విద్యార్థులున్నారు. నిరుపేద, ఆటిజం పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నారు. విద్యతో పాటు క్రీడల్లో, కంప్యూటర్, వ్యక్తిత్వ వికాసం పట్ల కూడా పాఠాలు బోధిస్తోంది. వీరికి హైజెనిక్ ఆహారంతోపాటు దుస్తులు కూడా ఇస్తోంది. ఆఫీస్ ఫ్రెండ్స్, సోషల్‌ మీడియా ద్వారా పరిచయమై ముందుకు వచ్చిన కొందరు, తోటి వాళ్లు మొత్తం 40 మంది వాలంటీర్లుగా పని చేస్తున్నారు. వారమంతా పని చేసే వీరు శని,ఆదివారాలు ఆటిజం పిల్లల కోసం కేటాయిస్తున్నారు.

First Published:  15 Nov 2015 12:33 PM GMT
Next Story