Telugu Global
Others

కేటీఆర్‌ రాజీనామా సవాల్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు సవాల్ విసిరారు. వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు నిలబడి కాంగ్రెస్‌ ఓడితే రాజీనామా చేసేందుకు ఆ పార్టీలో ఏ  నేత ముందుకొస్తారో  చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే జానారెడ్డి రాజీనామా చేస్తారో లేక  ఉత్తం కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారో ముందుకొచ్చి ప్రకటించాలన్నారు. కాంగ్రెస్‌లో  ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాయికి తగ్గ నేత ఎవరూ లేరని అందుకే తానే సవాల్ […]

కేటీఆర్‌ రాజీనామా సవాల్
X

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు సవాల్ విసిరారు. వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు నిలబడి కాంగ్రెస్‌ ఓడితే రాజీనామా చేసేందుకు ఆ పార్టీలో ఏ నేత ముందుకొస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే జానారెడ్డి రాజీనామా చేస్తారో లేక ఉత్తం కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారో ముందుకొచ్చి ప్రకటించాలన్నారు.

కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాయికి తగ్గ నేత ఎవరూ లేరని అందుకే తానే సవాల్ విసురుతున్నానని కేటీఆర్‌ ఒక టీవీ చానల్‌తో చెప్పారు. వరంగల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ నేతలను ప్రజలు, రైతులు నిలదీస్తున్నారన్నది కేవలం ఒక వర్గం మీడియా సృష్టేనని కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నిక తమ పాలనకు గీటురాయి లాంటిదేనన్నారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత, సచివాలయం తరలింపు, చీప్‌ లిక్కర్ వంటి అంశాల్లో ప్రజాభిప్రాయం మేరకే వెనక్కు తగ్గామని కేటీఆర్ చెప్పారు.

First Published:  14 Nov 2015 10:39 PM GMT
Next Story