Telugu Global
Others

బాక్సైట్‌ తవ్వకాలను అడ్డుకుంటాం: గిరిజనం హెచ్చరిక

విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలు జరపనివ్వబోమని మన్యం నాయకులు హెచ్చరించారు. కొన్ని దశాబ్దాలుగా వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ వస్తున్న అటవీ భూములను నాశనం చేయడం తగదని వారు ప్రభుత్వానికి హితవు చెప్పారు. తమ విన్నపాన్ని కాదని బాక్సైట్‌ తవ్వకాలను చేపడితే ప్రాణాలను పణంగా పెట్టయినా అడ్డుకుంటామని మన్యంలోని గిరిజన నాయకులు హెచ్చరించారు. బాక్సైట్‌ తవ్వకాలను ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కోరిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మన్యం ప్రాంతంలో పర్యటించి తమ గోడును తెలుసుకోవాలని వారు […]

బాక్సైట్‌ తవ్వకాలను అడ్డుకుంటాం: గిరిజనం హెచ్చరిక
X

విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలు జరపనివ్వబోమని మన్యం నాయకులు హెచ్చరించారు. కొన్ని దశాబ్దాలుగా వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ వస్తున్న అటవీ భూములను నాశనం చేయడం తగదని వారు ప్రభుత్వానికి హితవు చెప్పారు. తమ విన్నపాన్ని కాదని బాక్సైట్‌ తవ్వకాలను చేపడితే ప్రాణాలను పణంగా పెట్టయినా అడ్డుకుంటామని మన్యంలోని గిరిజన నాయకులు హెచ్చరించారు. బాక్సైట్‌ తవ్వకాలను ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని కోరిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మన్యం ప్రాంతంలో పర్యటించి తమ గోడును తెలుసుకోవాలని వారు కోరారు. బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖలోని గిరిజన భవన్‌లో జరిగిన సమావేశంలో నాయకులు ప్రసంగాలతో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఏజన్సీ ప్రాంత నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి బాలరాజు తదితరులతోపాటు పలు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాక్సైట్‌ తవ్వకాలను అడ్డుకుంటామని గిరిజన నాయకులు ప్రతిజ్ఞ చేశారు. బాక్సైట్‌ తవ్వకాలకు ఉద్దేశించిన జీవోను వెంటనే రద్దు చేసి గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.

మేమూ వ్యతిరేకిస్తున్నాం: శారదా పీఠాధిపతి
ఏపీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలపై పీఠాధిపతి స్పందిస్తూ… గిరిజనులకు కొండలు దైవంతో సమానం. అలాంటి కొండల్లో బాక్సైట్ తవ్వకాలు జరపడం సరికాదు. అవసరమైతే గిరిజనులకు మద్దతుగా పోరాడతానని పేర్కొన్నారు.

First Published:  15 Nov 2015 11:37 AM GMT
Next Story