Telugu Global
NEWS

కేసీఆర్ ముఖానికి కావాలనే నల్ల రంగు వేశారా?

అమరావతి శంకుస్థాపనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వెళ్లారు. ఆ  పరిణామం చూసి అందరూ సంతోషించారు. ఇద్దరు చంద్రుల ఇలాగే కలిసి ఉండాలని కోరుకున్నారు. అయితే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. కేసీఆర్‌ను ఏపీ ప్రభుత్వం అవమానించిందంటూ ఆయన పత్రిక ”నమస్తే తెలంగాణ” భారీ కథనాన్ని ప్రచురించింది. ఇంతకు అవమానం ఏమింటంటే… ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగనున్న ఎగ్జిబిషన్ సందర్భంగా అమరావతి గొప్పదనాన్ని దేశ ప్రజలకు తెలియజేయడం కోసం […]

కేసీఆర్ ముఖానికి కావాలనే నల్ల రంగు వేశారా?
X

అమరావతి శంకుస్థాపనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా వెళ్లారు. ఆ పరిణామం చూసి అందరూ సంతోషించారు. ఇద్దరు చంద్రుల ఇలాగే కలిసి ఉండాలని కోరుకున్నారు. అయితే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. కేసీఆర్‌ను ఏపీ ప్రభుత్వం అవమానించిందంటూ ఆయన పత్రిక ”నమస్తే తెలంగాణ” భారీ కథనాన్ని ప్రచురించింది. ఇంతకు అవమానం ఏమింటంటే…

kcr-face

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగనున్న ఎగ్జిబిషన్ సందర్భంగా అమరావతి గొప్పదనాన్ని దేశ ప్రజలకు తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఓ ఫోటో ఎగ్జిబిషన్ తరహాలో ఛాయాచిత్రాల ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఫోటోల్లో అమరావతి శంకుస్థాపనకు సంబంధించిన చిత్రాలను కూడా ఉంచారు. అయితే ఆ ఫోటోల్లో మోదీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల ముఖాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. వారితో పాటు నిల్చున్న కేసీఆర్ ముఖం మాత్రం నల్ల రంగు పూసినట్టుగా ఉంది.

నాలుగు చిత్రాల్లోనూ కేసీఆర్ ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కేసీఆర్ ముఖం కనిపించకుండా ఏపీ ప్రభుత్వమే ఇలా ఫోటోలను గ్రాఫిక్స్ సాయంతో మార్చేసిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తోటి తెలుగు రాష్ట్రం ఆహ్వానించింది కదాని శంకుస్థాపనకు వెళ్తే ఇప్పుడు ఇలా ముఖానికి నల్లరంగేసి తమ ముఖ్యమంత్రిని అవమానిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా చంద్రబాబు ప్రభుత్వ సంస్కృతి అని మండిపడుతున్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో ఢిల్లీలోని ఏపీ అధికారులు నోరు విప్పితేనే తెలుస్తుంది.

First Published:  14 Nov 2015 8:53 PM GMT
Next Story