Telugu Global
Cinema & Entertainment

నాగ్, రానా ఆ విషయంలో స్పెషలిష్టులు అయిపోయినట్లున్నారు

సీనియర్ హీరో నాగార్జున, టాలివుడ్ టవరింగ్ హీరో రానాకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఇద్దరికి ఇద్దరూ హ్యాండ్‌సమ్ స్టార్స్ కనుక అలాంటి ఫాలోయింగ్ ఉండడం సహజమే. ఇప్పుడిద్దరికీ ఇంకొక పోలిక కూడా ఉంది. అదేమిటంటే, ఇద్దరూ పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి రెండు కాదు, ఈ మధ్య కాలంలో ఇద్దరూ గెస్ట్ అప్పీయరెన్స్ స్పెషలిస్టులు అయ్యారంటే అతిశయోక్తి ఏమీ కాదు. లేటెస్టుగా అనుష్క శెట్టి, ఆర్య జంటగా నటిస్తున్న ‘సైజ్ జీరో ‘ […]

నాగ్, రానా ఆ విషయంలో స్పెషలిష్టులు అయిపోయినట్లున్నారు
X

సీనియర్ హీరో నాగార్జున, టాలివుడ్ టవరింగ్ హీరో రానాకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. ఇద్దరికి ఇద్దరూ హ్యాండ్‌సమ్ స్టార్స్ కనుక అలాంటి ఫాలోయింగ్ ఉండడం సహజమే. ఇప్పుడిద్దరికీ ఇంకొక పోలిక కూడా ఉంది. అదేమిటంటే, ఇద్దరూ పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి రెండు కాదు, ఈ మధ్య కాలంలో ఇద్దరూ గెస్ట్ అప్పీయరెన్స్ స్పెషలిస్టులు అయ్యారంటే అతిశయోక్తి ఏమీ కాదు. లేటెస్టుగా అనుష్క శెట్టి, ఆర్య జంటగా నటిస్తున్న ‘సైజ్ జీరో ‘ సినిమాలో వీళ్ళిద్దరూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. వీరితో పాటు… జీవ, హన్సిక, కాజల్, తమన్నా, సీనియర్ యాక్ట్రెస్ రేవతి, శ్రీదివ్య, బాబీ సిమ్‌హ కూడా గెస్ట్ రోల్స్ చేస్తున్నారట. మొత్తానికి ఈ సినిమా గెస్ట్ అప్పీయరెన్స్ స్పెషలిస్ట్ సినిమా లాగా అనిపిస్తోంది. చూద్దాం, ఇంకెంత మంది ఈ లిస్ట్ కి జతకలుస్తారో!

First Published:  16 Nov 2015 4:02 AM GMT
Next Story