Telugu Global
Cinema & Entertainment

అట్టర్ ఫ్లాప్ అయిన ప్రేమలీల

 సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ప్రేమలీల. ప్రేమ్ రథన్ ధన్ పాయో సినిమాకు తెలుగు వెర్షన్ ఇది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించడానికి ఒక కారణం ఉంది. రామ్ చరణ్, సల్మాన్ కు డబ్బింగ్ చెప్పడమే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ప్రేమలీల. దాదాపు 350 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ప్రేమలీల సినిమా ఏ ఒక్క థియేటర్ లో కూడా ఫుల్ ఆక్యుపెన్సీ […]

అట్టర్ ఫ్లాప్ అయిన ప్రేమలీల
X
సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ప్రేమలీల. ప్రేమ్ రథన్ ధన్ పాయో సినిమాకు తెలుగు వెర్షన్ ఇది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించడానికి ఒక కారణం ఉంది. రామ్ చరణ్, సల్మాన్ కు డబ్బింగ్ చెప్పడమే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ప్రేమలీల. దాదాపు 350 థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ప్రేమలీల సినిమా ఏ ఒక్క థియేటర్ లో కూడా ఫుల్ ఆక్యుపెన్సీ సాధించలేకపోయింది. చెర్రీ వాయిస్ ఎవర్నీ మెప్పించలేకపోయింది. డబ్బింగ్ వెర్షన్ కూడా పరమ బోర్ గా తయారైంది. ప్రేమలీల కంటే స్ట్రయిట్ హిందీ సినిమానే చూసేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపించారంటే.. డబ్బింగ్ ఎంత ఘోరంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. మొత్తమ్మీద ఈ వీకెండ్ గడిచేనాటికి ప్రేమలీల డిజాస్టర్ అని తేల్చేశారు ట్రేడ్ పండిట్స్. అటు ఒరిజినల్ వెర్షన్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేమ్ రథన్ ధన్ పాయో సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తోంది. సల్మాన్ స్టామినా వల్ల సినిమాకు ఓపెనింగ్ వసూళ్లు వచ్చినప్పటికీ.. లాంగ్ రన్ లో సినిమా నిలబడదని అంతా తేల్చిపడేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సల్మాన్ సినిమాకు వసూళ్లు బాగావస్తున్నాయి.. సినిమా మాత్రం ఫ్లాప్.
First Published:  15 Nov 2015 7:05 PM GMT
Next Story