Telugu Global
National

ప్రియాంకతో కలిసి స్పీకర్‌ సుమిత్రను కలిసిన సోనియా

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. ఇందులో కొత్తేమీ లేదు. కాని ఆమెతోపాటు ఈసారి ఆమె ముద్దుల కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉంది. సోమవారం బాగా పొద్దు పోయాక సోనియాగాంధీ ఆమె కుమార్తె ప్రియాంకను తీసుకుని సుమిత్రా మహాజన్‌ ఇంటికి వెళ్ళడం ఇపుడు చర్చనీయాంశమైంది. అయితే ఇది మర్యాద పూర్వక సమావేశమేనని సుమిత్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే మరో పది రోజుల్లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో […]

ప్రియాంకతో కలిసి స్పీకర్‌ సుమిత్రను కలిసిన సోనియా
X

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిశారు. ఇందులో కొత్తేమీ లేదు. కాని ఆమెతోపాటు ఈసారి ఆమె ముద్దుల కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉంది. సోమవారం బాగా పొద్దు పోయాక సోనియాగాంధీ ఆమె కుమార్తె ప్రియాంకను తీసుకుని సుమిత్రా మహాజన్‌ ఇంటికి వెళ్ళడం ఇపుడు చర్చనీయాంశమైంది. అయితే ఇది మర్యాద పూర్వక సమావేశమేనని సుమిత్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే మరో పది రోజుల్లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్‌ 26 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు మొదలవనున్నాయి. గత పార్లమెంట్‌ సమావేశాల్లో కనీసం ఒక్కరోజు కూడా సమావేశాలు జరిగనివ్వని నేపథ్యంలో ఈసారి మహాజన్‌ను కలిసి ఏం చెప్పాలని వెళ్ళారో అర్ధం కాక అధికార పక్షం సభ్యులు సతమతమవుతున్నారు. ఇటీవలే సోనియాగాంధీతోపాటు ఆమె పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులందరూ కలిసి వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వ ‘అసహన’ ధోరణిపై ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని సుమిత్ర మహాజన్‌కు చెప్పినట్టు భావిస్తున్నారు. పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిపై ప్రతిపక్ష పార్టీలన్నీ చాలా కాలం నుంచి విమర్శలు గుప్పిస్తున్నాయి. దాంతోపాటు గోమాంసం తిన్నాడన్న ఆరోపణలతో దాద్రిలో ఓ మైనారిటీ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపడం, రచయితలు, కళాకారులు, రక్షణశాఖకు చెందిన సభ్యులు, మాజీ సైనికులు అవార్డులను తిరిగి ఇచ్చేయడం తదితర అంశాలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తాము అనురించదలచుకున్న వైఖరిని ముందుగానే స్పీకర్‌ స్థానంలో ఉన్న సుమిత్ర మహాజన్‌కు చెప్పాలని భావించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే తనకూడా ప్రియాంక గాంధీని తీసుకురావడం వెనుక బలమైన కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. భావి నాయకురాలుగా ఆమెను తీర్చిదిద్దడానికి సోనియా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు భావిస్తున్నారు.

First Published:  16 Nov 2015 12:02 PM GMT
Next Story