Telugu Global
National

రాహుల్ బ్రిటన్ పౌరుడు- మోదీకి స్వామి లేఖ

సోనియా గాంధీ కుటుంబాన్ని వెంటాడుతున్న బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈసారి ఏకంగా రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదంటున్నారాయన. అందుకు సాక్ష్యంగా కొన్ని డాక్యుమెంట్లను కూడా చూపుతున్నారు. లండన్‌లో ఒక కంపెనీ ఫ్లోట్ చేసే సమయంలో తాను బ్రిటిష్ పౌరుడనంటూ స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని స్వామి ఆరోపిస్తున్నారు. సదరు కంపెనీ వార్షిక నివేదికలో ఈ విషయం స్పష్టంగా ఉందంటున్నారు. పుట్టిన రోజు తేదీని కరెక్టుగానే ఇచ్చిన రాహుల్ గాంధీ […]

రాహుల్ బ్రిటన్ పౌరుడు- మోదీకి స్వామి లేఖ
X

సోనియా గాంధీ కుటుంబాన్ని వెంటాడుతున్న బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈసారి ఏకంగా రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదంటున్నారాయన. అందుకు సాక్ష్యంగా కొన్ని డాక్యుమెంట్లను కూడా చూపుతున్నారు. లండన్‌లో ఒక కంపెనీ ఫ్లోట్ చేసే సమయంలో తాను బ్రిటిష్ పౌరుడనంటూ స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని స్వామి ఆరోపిస్తున్నారు.

సదరు కంపెనీ వార్షిక నివేదికలో ఈ విషయం స్పష్టంగా ఉందంటున్నారు. పుట్టిన రోజు తేదీని కరెక్టుగానే ఇచ్చిన రాహుల్ గాంధీ జాతీయతను మాత్రం బ్రిటిష్ అని చూపారని చెబుతున్నారు. ఇలా చేయడం నేరమంటున్నారు స్వామి. భారత రాజ్యాంగానికి వ్యతిరేకమంటున్నారు . ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నందున ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాహుల్ భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సుబ్రమణ్యం స్వామి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఆ లేఖల కాపీలను మీడియాకు అందజేశారు.

First Published:  16 Nov 2015 9:00 AM GMT
Next Story