Telugu Global
NEWS

వైసీపీపై సెటైర్ బాగానే ఉంది కానీ...

కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబుకు రక్షకుడిగా ఉంటారన్న పేరు తెచ్చుకున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వైసీపీపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సెటైర్లు వేశారు. ఏపీలో ఒక పార్టీ ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేస్తోందన్నారు. టీడీపీ బయటకు వస్తే తాను కేంద్రంలో చేరిపోవాలనుకుంటోందని వెంకయ్యనాయుడు విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి నచ్చి ప్రజలు ఓటేశారని… కనుక తాము కలిసే రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతామన్నారు. అంతేకాదు… అమరావతిలోనే అభివృద్ది కేంద్రీకరిస్తున్నారంటూ […]

వైసీపీపై సెటైర్ బాగానే ఉంది కానీ...
X

కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబుకు రక్షకుడిగా ఉంటారన్న పేరు తెచ్చుకున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వైసీపీపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సెటైర్లు వేశారు. ఏపీలో ఒక పార్టీ ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేస్తోందన్నారు. టీడీపీ బయటకు వస్తే తాను కేంద్రంలో చేరిపోవాలనుకుంటోందని వెంకయ్యనాయుడు విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి నచ్చి ప్రజలు ఓటేశారని… కనుక తాము కలిసే రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతామన్నారు.

అంతేకాదు… అమరావతిలోనే అభివృద్ది కేంద్రీకరిస్తున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తాము మరియు చంద్రబాబునాయుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని జిల్లాలు అబివృద్ది చేయాలనే సంకల్పంతో ఉన్నామని వెంకయ్య చెప్పుకొచ్చారు. టీడీపీ కేంద్రం నుంచి బయటకు వస్తే వైసీపీ చేరాలనుకుంటోందని చెప్పడం ద్వారా వెంకయ్యనాయుడు తన మనసులో చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నట్టుగా ఉంది. చంద్రబాబు కూడా వైసీపీపై అచ్చం ఇదే ఆరోపణ చేస్తూ వస్తున్నారు.

ఒక వేళ వెంకయ్యనాయుడు చెప్పినట్టు టీడీపీ స్థానంలో వైసీపీ కేంద్రంలో చేరితే అది చంద్రబాబుకే రాజకీయంగా మంచిది కదా!. ఎందుకంటే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలే కనిపించడం లేదు. అలాంటప్పుడు ప్రత్యేక హోదా సాధించకుండానే మోదీ ప్రభుత్వంతో జతకడితే వచ్చే ఎన్నికల్లో ఆ నిందను జగనే మోయాల్సి ఉంటుంది. అప్పుడు టీడీపీకి మంచి ప్రచార అస్త్రం కూడా దొరుకుతుంది కదా అన్నది కొందరి అభిప్రాయం. మరి ఈ లాజిక్ మరిచి వెంకయ్యనాయుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారో!?. అయినా ఎన్డీఏ నుంచి బయటకు రాకుండా చంద్రబాబు అంటిపెట్టుకుని ఉండడానికి కారణాలు వేరే ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.

First Published:  16 Nov 2015 7:57 AM GMT
Next Story