Telugu Global
Others

బాలయ్యకు చంద్రబాబు 200కోట్ల గిఫ్ట్

రాజు తలుచుకుంటే రాయి కూడా పగులుతుందన్న సామెత ఇప్పుడు ఏపీలో నిజమవుతోంది. ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా అయినవాళ్లకు భూ కేటాయింపులు చేసేస్తోంది. కొద్దిరోజుల క్రితం గల్లా కుటుంబానికి, తరువాత లోకేష్ బంధువుకు, ఆ తరువాత లోకేష్‌ మిత్రుడికి, ఇవాళ బాలయ్యకు. ఇలా అనుకున్న వారికి అనుకున్నట్టు భూములు కేటాయించేస్తున్నారు. అవును అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన చంద్రబాబు.. దానికి ఉన్న భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ విద్యాధరపురంలోని ఐదెకరాల స్థలాన్ని […]

బాలయ్యకు చంద్రబాబు 200కోట్ల గిఫ్ట్
X

రాజు తలుచుకుంటే రాయి కూడా పగులుతుందన్న సామెత ఇప్పుడు ఏపీలో నిజమవుతోంది. ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా అయినవాళ్లకు భూ కేటాయింపులు చేసేస్తోంది. కొద్దిరోజుల క్రితం గల్లా కుటుంబానికి, తరువాత లోకేష్ బంధువుకు, ఆ తరువాత లోకేష్‌ మిత్రుడికి, ఇవాళ బాలయ్యకు. ఇలా అనుకున్న వారికి అనుకున్నట్టు భూములు కేటాయించేస్తున్నారు. అవును అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన చంద్రబాబు.. దానికి ఉన్న భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ విద్యాధరపురంలోని ఐదెకరాల స్థలాన్ని ఇండో అమెరికన్‌ డెంటల్‌ ఇనిస్టిట్యూట్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటీ రెండు రోజుల్లో దీనిపై ఎంఓయు చేసుకోబోతున్నట్టు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయంతో ఎలాంటి లీజు లేకుండానే ఈ స్థలాన్ని అప్పగించేందుకు ఆర్‌టిసి యాజమాన్యం కూడా సిద్ధమైంది. ఐదు ఎక‌రాల విస్తీర్ణం క‌లిగిన ఆస్థలం మార్కెట్ విలువ‌ సుమారు 200 కోట్లు ఉంటుందని అంచనా. చంద్రబాబు వియ్యంకుడు ఎమ్మెల్యే బాల‌కృష్ణ సార‌థ్యంలోని బసవతారకం ట్రస్ట్ కు ప్రభుత్వ స్థలం అప్పగించాల‌ని నిర్ణయించ‌డం ఆశ్చర్యప‌రుస్తోంది. అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దలు ప్రజ‌ల సొమ్మును ఎలా అప్పగిస్తారన్న విమర్శలొస్తున్నారు. డెంటల్‌ హాస్పటల్ నిర్మాణం పేరుతో ఆ స్థలాన్ని అప్పగించ‌డంపై విపక్షాలు మండిపడుతున్నాయి.

నిజానికి ఇప్పుడున్న ఈ స్థలంలో ఆర్టీసీ ఉద్యోగులకు అవసరమైన ఆస్పత్రిని నిర్మించాలని ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఉన్న ఆస్పత్రి వారికే చెందడంతో ఏపీలోని ఉద్యోగులకు ఓ ఆస్పత్రి అవసరం. దీంతో ల‌క్షమందికి పైగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాల కోసం అన్ని సౌక‌ర్యాల‌తో ఆసుప‌త్రి వ‌స్తుంద‌ని ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా అంత విలువైన స్థలాన్ని కార్మికుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి చంద్రబాబు కుటుంబ సంస్థకు అప్పగించాల‌ని నిర్ణయించ‌డం ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ అసంతృప్తికి కారణమవుతోంది.

First Published:  17 Nov 2015 1:25 AM GMT
Next Story